Minister Harish Rao Criticized : నీతి ఆయోగ్ ఇవ్వాలని చెప్పినా..కేంద్రం నిధులు ఇవ్వడం లేదు : మంత్రి హరీష్ రావు

కేంద్రం ప్రభుత్వం, నీతి ఆయోగ్ పై తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. నీతి ఆయోగ్ రాజకీయ రంగు పులుముకుందని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. సీఎం కేసీఆర్ ఏ ప్రశ్నకు నీతి ఆయోగ్ సమాధానం చెప్పలేదన్నారు. హర్ ఘర్ జల్ కింద రూ.3982 కోట్లు కేటాయించారు..కానీ ఆ నిధులను కేంద్రం విడుదల చేయడం లేదన్నారు. పైగా ఆ నిధులను రాష్ట్రం వాడుకోలేదని నీతి ఆయోగ్ తప్పుడు ప్రకటన చేసిందన్నారు.

Minister Harish Rao Criticized : నీతి ఆయోగ్ ఇవ్వాలని చెప్పినా..కేంద్రం నిధులు ఇవ్వడం లేదు : మంత్రి హరీష్ రావు

Harish Rao criticized central govt and NITI Aayog

minister Harish Rao criticized : కేంద్రం ప్రభుత్వం, నీతి ఆయోగ్ పై తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. నీతి ఆయోగ్ రాజకీయ రంగు పులుముకుందని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. సీఎం కేసీఆర్ ఏ ప్రశ్నకు నీతి ఆయోగ్ సమాధానం చెప్పలేదన్నారు. హర్ ఘర్ జల్ కింద రూ.3982 కోట్లు కేటాయించారు..కానీ ఆ నిధులను కేంద్రం విడుదల చేయడం లేదన్నారు. పైగా ఆ నిధులను రాష్ట్రం వాడుకోలేదని నీతి ఆయోగ్ తప్పుడు ప్రకటన చేసిందన్నారు. నీతి ఆయోగ్ డబ్బులు కేటాయించామంటుంది.. కేంద్రం నిధులు ఇవ్వదని వెల్లడించారు.

నీతి ఆయోగ్ నిర్ణయాలను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని నీతి ఆయోగ్ ప్రశంసించిందని తెలిపారు. నీతి ఆయోగ్ ఇవ్వాలని చెప్పినా..కేంద్రం నిధులు విడుదల చేయలేదన్నారు. సమాఖ్య స్ఫూర్తి ఎక్కడుందని ప్రశ్నించారు. నీతి ఆయోగ్ స్వతంత్ర ప్రాతిపదికగా ఉండాల్సిన సంస్థ అని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ కేంద్రం మెడలు వంచి రాష్ట్రాల హక్కులను కాపాడాలని చెప్పారు. నిధుల కోసం కేంద్రానికి ఎన్నో లేఖలు రాశామని గుర్తు చేశారు.

Harish Rao: ఆర్మీని ప్రైవేటు పరం చేసే కుట్ర: మంత్రి హరీష్ రావు

ఇంటింటికీ నీరు అందించే కొత్త రాష్ట్రాలకే నిధులు ఇస్తామంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ లక్ష్యాన్ని సాధించిందని నిధులు ఎగ్గొట్టారని మండిపడ్డారు. నీతి ఆయోగ్ సిఫారసులను కేంద్రం చెత్తబుట్టలో వేసిందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాలకు ఇచ్చే నిధులు 32 నుంచి 42 శాతానికి పెంచినట్లు చెబుతున్నారు..ఇది పూర్తి అవాస్తవం అన్నారు. సెస్ ల రూపంలో కేంద్రం ఏడేళ్లలో రూ.15 లక్షల 47 వేల 560 కోట్లు సమకూర్చుకుందని తెలిపారు.

ఈ సంవత్సరం బడ్జెట్ లో కేవలం రూ.5 లక్షల 35 వేల 112 కోట్లు పెట్టారని గుర్తు చేశారు. రూ.42 వేల కోట్లు తెలంగాణకు రాకుండా చేశారని ఆరోపించారు. తెలంగాణ నష్టపోయిన రూ.42 వేల కోట్ల గురించి నీతి ఆయోగ్ మాట్లాడటం లేదన్నారు. రాష్ట్రాలకు 42 శాతం కాదు 29.6 శాతం మాత్రమే వస్తుందని తెలిపారు. అంకెల గారడి కాదు..నిజాలు చెప్పిండి అని అన్నారు. నీతి ఆయోగ్ వాస్తవాలను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. కేసీఆర్ ప్రశ్నలకు నీతి ఆయోగం సమాధానం ఇవ్వలేదన్నారు.