Minister Harish Rao : జీడీపీ పడిపోయింది, అప్పులు పెరిగిపోయాయి- పెద్దనోట్ల రద్దుతో కేంద్రం ఏం సాధించింది?-హరీశ్ రావు

డీమానిటైజేషన్ ఒక అట్టర్ ప్లాప్ షో. డీమానిటైజేషన్ ఫెయిల్యూర్ ప్రోగ్రాం అని పార్లమెంటులో కేంద్రమే చెప్పింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన సమాధానం వల్ల డీ-మానిటైజేషన్ నిజాలు బయటపడ్డాయి. 2022 మార్చి నాటికి నకిలీ 500 నోట్లు 1లక్ష 89వేలు పైనే, 2వేల నోట్లు 70వేలకు పైగానే చలామణిలో ఉన్నాయి. డీమానిటైజేషన్ వల్ల 50శాతం ఫేక్ కరెన్సీ పెరిగిందని ఆర్బీఐ లెక్కలు చెప్తున్నాయి.

Minister Harish Rao : జీడీపీ పడిపోయింది, అప్పులు పెరిగిపోయాయి- పెద్దనోట్ల రద్దుతో కేంద్రం ఏం సాధించింది?-హరీశ్ రావు

Minister Harish Rao : తెలంగాణలో హాట్ హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటి, జరిగేది మరొకటి అని మంత్రి హరీశ్ విమర్శించారు.

‘డీమానిటైజేషన్ ఒక అట్టర్ ప్లాప్ షో. డీమానిటైజేషన్ ఫెయిల్యూర్ ప్రోగ్రాం అని పార్లమెంటులో కేంద్రమే చెప్పింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన సమాధానం వల్ల డీ-మానిటైజేషన్ నిజాలు బయటపడ్డాయి. 2022 మార్చి నాటికి నకిలీ 500 నోట్లు 1లక్ష 89వేలు పైనే, 2వేల నోట్లు 70వేలకు పైగానే చలామణిలో ఉన్నాయి. డీమానిటైజేషన్ వల్ల 50శాతం ఫేక్ కరెన్సీ పెరిగిందని ఆర్బీఐ లెక్కలు చెప్తున్నాయి.(Minister Harish Rao)

Also Read..Hyderabad Lok Sabha Constituency : ఎంఐఎం పార్టీకి కంచుకోట‌గా హైద‌రాబాద్ పార్లమెంట్…..పట్టు సాధించడం కోసం కాంగ్రెస్, బీజెపీల ప్రయత్నాలు

13 లక్షల కోట్ల నుంచి 31 లక్షల కోట్ల నగదు దేశంలో చలామణి 2014 నుంచి 2022వరకు అయింది. జీడీపీలో 11శాతం క్యాష్ చలామణి 2014లో ఉంటే డీ-మానిటైజేషన్ తరువాత 13శాతానికి పెరిగింది. పెద్ద నోట్ల రద్దు అని చెప్పి 2వేల నోటును తెచ్చారు. పెద్ద నోట్ల రద్దు టార్గెట్ తో డీ మానిటైజేషన్ తెచ్చి.. చిన్న నోట్లను మోదీ రద్దు చేశారు.

నల్లధనం బయటకు తెచ్చేందుకు డీమానిటైజేషన్ సక్సెస్ కాలేదు. నోట్ల రద్దు వల్ల దేశంలో ఉన్న మహిళల పోపు డబ్బాలోని డబ్బులు మాత్రమే బయటకు వచ్చాయి. 5 ట్రిలియన్ ఎకానమీని ఒక జోక్ చేసింది కేంద్ర బీజేపీ. పెద్ద నోట్ల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు 5లక్షల కోట్ల నష్టం. క్యూలైన్లలో నిలబడి 108మంది మృతి చెందారు. పెద్ద నోట్ల రద్దు పేరుతో కొత్త నోట్ల ముద్రణకు రూ.21వేల కోట్లు కేంద్రం ఖర్చు చేసింది. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ జీడీపీ పడిపోయింది. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ప్రజలకు జరిగిన లాభం ఒక్కటైనా బీజేపీ చెప్పగలుగుతుందా?

Also Read..TSPSC Paper Leak : TSPSC ప్రశ్నాపత్రాలు, గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీక్ .. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఘాటు విమర్శలు

ఇదే తప్పు ఏ రాష్ట్రమైనా చేస్తే కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు చేసేది. 2014లో 62లక్షల కోట్లు అప్పు ఉంటే ఇప్పుడు 162లక్షల కోట్లు అప్పు అయింది బీజేపీ పాలన వల్ల. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ప్రజలకు కేంద్రం క్షమాపణ చెప్పాలి. వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. అనాలోచిత నిర్ణయాల వల్ల దేశ ప్రజలను ఇబ్బంది పెడుతోంది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ డొల్ల మాటలతో ప్రజల్లో భ్రమలు కల్పిస్తారు. బీజేపీ విజయం సాధించింది మత పిచ్చిని రెచ్చగొట్టడంలో మాత్రమే” అని మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.