KTR America Tour : ప్రపంచానికి ‘నీటి పాఠాలు’ చెప్పటానికి అమెరికాకు మంత్రి కేటీఆర్ పయనం

తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు బయలుదేరారు. ప్రపంచానికి తెలంగాణ నీటి విజయాల పాఠాలు చెప్పటానికి తద్వారా తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావటానికి మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగనుంది.

KTR America Tour : ప్రపంచానికి ‘నీటి పాఠాలు’ చెప్పటానికి అమెరికాకు మంత్రి కేటీఆర్ పయనం

Minister KTR America Tour

KTR America Tour : తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు బయలుదేరారు.ప్రపంచానికి తెలంగాణ నీటి విజయాల పాఠాలు చెప్పటానికి తద్వారా తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావటానికి మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగనుంది. మే మూడవ వారం వరకు కేటీఆర్ అమెరికా పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ తెలంగాణలో అనుసరిస్తున్న నీటి వివరాలను వివరించనున్నారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ నిర్వహిస్తున్న వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ సదస్సులో ప్రసంగించనున్నారు.

తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన విజయాలను..సాధిస్తున్న విజయాలను, మిషన్ భగీరథ ప్రాజెక్టు గురించి సదస్సులో వివరించనున్నారు. తెలంగాణలో అనుసరిస్తున్న సాగు, తాగునీటి వివరాలను తెలియజేసేందుకు తమ సదస్సుకు హాజరు కావాలన్న సంస్థ విజ్ఞప్తి మేరకు కేటీఆర్ పర్యటన కొనసాగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల నిర్మాణం, వాటి ఫలితాల పైన మంత్రి ఈ సదస్సులో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

ఈ పర్యటనలో మంత్రి కేటీఆర్ పలు దిగ్గజ కంపెనీలతో సమావేశం కానున్నారు. అంతేకాకుండా ఈ పర్యటనను తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేవిధంగా కేటీఆర్ ప్లాన్ చేసుకున్నారు. పలు కంపెనీలు తమ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉంది.ఈరోజు నుంచి రెండు వారాలపాటు అమెరికాలో కేటీఆర్ పర్యటన ఉంటుంది. పెట్టుబడులను తెలంగాణకు ఆకర్షించటమే లక్ష్యంగా కేటీఆర్ పర్యటన నేపథ్యం ఉంది. అమెరికాలో ప్రముఖ కంపెనీల ఛర్మన్లు,సీఈవోలు, ఇతర ప్రతినిథులతో కేటీఆర్ సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు.

ఇటీవలే యూకేలో పర్యటించిన మంత్రి కేటీఆర్ తెలంగాణకు పలు పెట్టుబడులు తీసుకొచ్చారు. స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్ దిగ్గజనం డాన్జ్ హైదరాబాద్ లో ప్రొడక్ట్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ ఏర్పాటు చేయటంతో దాదాపు 1000మందికి ఉపాథి లభిస్తుందని సదరు సంస్థ ప్రకటించింది.కేటీఆర్ సమక్షంలోనే డాన్జ్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదిరింది. ఇలా విదేశీ పర్యటనలో మంత్రి కేటీఆర్ తెలంగాణకు పెట్టుబడులు పెట్టాలని దానికి తెలంగాణలో ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తారో వివరిస్తు పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణను నిర్మిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ను పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు.