KTR : తెలంగాణ రెండో ఐటీ పాలసీ..10 లక్షల మందికి ఉద్యోగాలు

తెలంగాణ మంత్రి కేటీఆర్ రెండో ఐటీ పాలసీని ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర నుంచి 3 లక్షల కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.

KTR : తెలంగాణ రెండో ఐటీ పాలసీ..10 లక్షల మందికి ఉద్యోగాలు

Ktr

Telangana IT policy : వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర నుంచి 3 లక్షల కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. గురువారం (సెప్టెంబర్16, 2021) మంత్రి కేటీఆర్ తెలంగాణ రెండో ఐటీ పాలసీని ప్రకటించారు. ఈ రంగంలో 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఎలక్ట్రానిక్స్ లో వచ్చే ఐదేళ్లలో రూ.ఏడు వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యమని పేర్కొన్నారు.

ఐటీ కంపెనీలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా తమ కార్యకలాపాలను విస్తరించాలని కోరారు. తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్నరాష్ట్రమని కొనియాడారు. గడిచిన ఐదేళ్లలో ఎన్నో ఎంఎన్ సీ కంపెనీలు హైదరాబాద్ కు వచ్చాయని తెలిపారు. ప్రపంచంలోని టాప్-5 టెక్ కంపెనీలు సెంటర్లు ఏర్పాటు చేశాయని పేర్కొన్నారు.

IT Employees : ఐటీ ఉద్యోగులకు గుడ్ టైమ్ మొదలైంది?

ఈ-గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఆదివారం కూడా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవచ్చన్నారు. పేపర్ లెస్..మ్యాన్ లెస్ గవర్నెన్స్ అందిస్తామని చెప్పారు. రూ.1,300 కోట్లతో స్టార్టప్ నిధి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఐటీ రంగంలో వార్షిక వృద్ధిలో తెలంగాణ మొదటిస్థానంలో ఉందన్నారు. ప్రపంచంలోని 5 పెద్ద కంపెనీలు హైదరాబాద్ లో ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలో టీ-వర్క్స్ ప్రారంభిస్తామని చెప్పారు.