Minister KTR criticized : కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్.. తొమ్మిదేళ్లవుతున్నా పునర్విభజన చట్టం హామీలు నెరవేర్చలేదు

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. ఇప్పటికీ తొమ్మిదేళ్లు అవుతున్నా పునర్విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చలేదని విమర్శించారు. సీఐఐ రాష్ట్ర వార్షిక సమావేశంలో కేంద్రంపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు.

Minister KTR criticized : కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్.. తొమ్మిదేళ్లవుతున్నా పునర్విభజన చట్టం హామీలు నెరవేర్చలేదు

MINISTER KTR

Minister KTR criticized : కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. ఇప్పటికీ తొమ్మిదేళ్లు అవుతున్నా పునర్విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చలేదని విమర్శించారు. సీఐఐ రాష్ట్ర వార్షిక సమావేశంలో కేంద్రంపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. ప్రపంచ ఫార్మా రంగంలో హైదరాబాద్ అగ్రగామిగా ఉన్నా.. కేంద్రం నుంచి సహకారం లేదన్నారు.

విభజన చట్టం ప్రకారం ఇస్తామన్న పారిశ్రామిక కారిడార్లు, ప్రోత్సహకాలు అందలేదన్నారు. తెలంగాణతోపాటు ఏపీ పరిస్థితీ ఇలానే ఉందని తెలిపారు. చట్టం ప్రకారం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కేంద్రాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతోందని.. అయినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్ లో అతి పెద్ద ఫార్మాక్లస్టర్ ఉంది.. దీనికి కేంద్రం నుంచి మద్దతు లేదని చెప్పారు.

Minister KTR : చేనేతకు వెన్నుపోటు పొడిచిన ఏకైక ప్రధాని మోడీ : మంత్రి కేటీఆర్

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ దేశంలోనే పెద్దదన్నారు. దీనికి కేంద్రం నుంచి సహకారం లేదని పేర్కొన్నారు. కేంద్రం కొత్త తయారీ పరిశ్రమలను ఇవ్వడం లేదని విమర్శించారు. ఈ ప్రశ్నలు కేంద్రాన్ని అడుగుతున్నామని.. చట్ట ప్రకారం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు.