Telangana : కమ్మ వాళ్లను తొక్కేస్తున్నారు.. ఐక్యతగా ఉండాలి – మంత్రి పువ్వాడ

కమ్మ సామాజికవర్గం మంత్రి కొడాలి నానిని తొలగించారని, ఇప్పుడు తనను మంత్రి పదవి నుంచి తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని పువ్వాడ అన్నారు...

Telangana : కమ్మ వాళ్లను తొక్కేస్తున్నారు.. ఐక్యతగా ఉండాలి – మంత్రి పువ్వాడ

Puvvada

 Puvvada Ajay Kumar : కమ్మ వాళ్లంతా ఐక్యంగా ఉండాలి..కమ్మ కులస్తులు రాజకీయాలకతీతంగా ఐక్యతగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ పిలుపునిచ్చారు. ఒక చిన్న ఇన్సిడెంట్ విషయంలో కుట్రలు చేస్తూ.. కుతంత్రాలు పన్నుతూ ఏకమౌతున్నారని ఆరోపించారు. కొంతమంది సూడో చౌదరీలు చేతులు కలుపుతున్నారని.. దీనిని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ మంత్రివర్గ విస్తరణలో చోటు చేసుకున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించడం గమనార్హం. ఏపీలో కమ్మ సామాజికవర్గానికి చెందిన మంత్రి కొడాలి నానిని తొలగించారని, ఇప్పుడు తనను మంత్రి పదవి నుంచి తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని పువ్వాడ అన్నారు. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ పీఎస్ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Read More : Jagga reddy: మంత్రి పువ్వాడ అజయ్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి

అతను సూసైడ్ చేసుకోవడానికి కారణం మంత్రి పువ్వాడ.. ఇతర టీఆర్ఎస్ నేతలని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి పువ్వాడ, త్రీ టౌన్ సీఐ వేధింపులు తట్టుకోలేక సాయి గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ ఘటనను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. మంత్రి పువ్వాడను బర్తరఫ్ చేసి ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు సైతం నిర్వహించింది. ఈ విషయంలో కేంద్రం కూడా రంగంలోకి దిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. సాయి గణేష్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. పలువురు కేంద్ర మంత్రులు ఖమ్మం జిల్లాకు చేరుకుని ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. తాజాగా మంత్రి పువ్వాడ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.