Telangana : ధాన్యం కొనుగోళ్ల పంచాయితీ..కేంద్రం ఏం చెబుతుంది ?

ధాన్యం కొనుగోళ్లు, బియ్యం సేకరణ అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telangana : ధాన్యం కొనుగోళ్ల పంచాయితీ..కేంద్రం ఏం చెబుతుంది ?

Paddy2

Paddy Purchase : తెలంగాణ రాష్ట్ర ధాన్యం కొనుగోళ్ల పంచాయితీకి ఫుల్ స్టాప్ పడడం లేదు. ధాన్యం కొనుగోళ్లు, బియ్యం సేకరణ తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టతనివ్వడం లేదు. దీనిపై కేంద్రంతో చర్చించేందుకు ఇటీవలే సీఎ కేసీఆర్, మంత్రివర్గ బృందం ఢిల్లీకి వెళ్లింది. కానీ..ప్రధాన మంత్రి అపాయింట్ మెంట్ దొరకకపోవడంతో సీఎం కేసీఆర్ హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. ఈ క్రమంలో…కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ కావాలని రాష్ట్ర మంత్రులు నిర్ణయించారు.

Read More : Covid 19 : ఏపీలో కరోనా..ఆ జిల్లాలో సున్నా కేసులు

అందులో భాగంగా…2021, నవంబర్ 26వ తేదీ శుక్రవారం కృషి భవన్ లో ఈ భేటీ జరుగుతోంది.. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు, బియ్యం సేకరణ అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సమావేశంలో మంత్రి కేటీఆర్ నేతృత్వంలో బృందం లేవనెత్తిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తెలియచేస్తుందని సమాచారం.

Read More : Solar Eclipse : ఆకాశంలో మరో అద్భుతం, డిసెంబర్ 04న సూర్యగ్రహణం

ఖరీఫ్, రబీ (2021-22) రెండు సీజన్లలో కలిపి 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. యాసంగిలో ఎంత మొత్తంలో ధాన్యం సేకరిస్తారో చెబితే రైతులకు స్పష్టత ఇస్తామని వెల్లడిస్తోంది. రెండు పంటల్లో కలిపి ఎంత ధాన్యం సేకరిస్తారో కేంద్రం ఒకేసారి తెలపాలని సూచిస్తోంది. పారాబాయిల్డ్ రైస్ కొనేది లేదని ఇప్పటికే కేంద్రం స్పష్టమైన వైఖరి తెలియచేసింది. ముడి బియ్యమే ఎంత మేర కొంటారో స్పష్టం చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఈ క్రమంలో… ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనే ఉత్కంఠ నెలకొంది.