Ramappa Temple : రామప్ప దేవాలయ అభివృద్ధికి రూ.250 కోట్లు ఇవ్వండి : మంత్రి శ్రీనివాస గౌడ్

రామప్ప దేవాలయంతో పాటు ఆలయ పరిసరాలను కూడా అభివృద్ది చేయటానికి రూ.250 కోట్లు కేటాయించాలని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర మంత్రి కిషన్ కుమార్ ను కోరారు.

Ramappa Temple : రామప్ప దేవాలయ అభివృద్ధికి రూ.250 కోట్లు ఇవ్వండి : మంత్రి శ్రీనివాస గౌడ్

Ramappa Temple

development of Ramappa temple : కాకతీయుల వైభవాన్ని ప్రతిబింబించేలా అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఉట్టిపడే రామప్ప దేవాలయానికి ఇటీవలే యునెస్కో గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే.రామప్ప దేవాలయంతో పాటు దాని అనుబంధ కట్టడాలను సరంక్షించేలా,కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్‌గా ఆ ప్రదేశాన్ని అభివృద్ది చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చేయాల్సిన అవసరం ఉంది. ఈక్రమంలో రామప్ప దేవాలయంతో పాటు ఆలయ పరిసరాలను కూడా అభివృద్ది చేయటానికి రూ.250 కోట్లు కేటాయించాలని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర మంత్రి కిషన్ కుమార్ ను కోరారు. కేసీఆర్ కృషి వల్లనే రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపులభించింది అని అన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆలయానికి ఎంతో చరిత్ర ఉన్నాగానీ ఉమ్మడి రాష్ట్రంలో సరైనగుర్తింపుదక్కలేదని ఆరోపించారు. కాకతీయ మెరిటేజ్ టూరిజంగా సర్క్యూట్ గా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

రాబోయే రోజుల్లో రామప్ప దేవాలయం గొప్ప టూరిజం స్పాట్ గా విరాజిల్లుతుందని అన్నారు. ఆలయ సంరక్షణను గత ప్రభుత్వాలు గాలికి వదిలేసాయని మంత్రి వివమర్శించారు. ప్రభుత్వ పర్యవేక్షణ కరువవడంతో ఇక్కడి పలు కట్టడాలు పాకురుపట్టిపోగా.. కొన్ని కూలిపోయే స్థితికి చేరుకున్నాయని..కానీ సీఎం కేసీఆర్ కృషి వల్ల రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించిందని..ఇప్పుడు ఆ ఆలయం అభివద్ధికి నిధులు కేటాయించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కోతున్నామని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

తాజాగా రామప్పకు యునెస్కో గుర్తింపు లభించడంపై ప్రభుత్వం రామప్ప దేవాలయంవైపు దృష్టి సారించింది. వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో రూల్ 22.7 ద్వారా యునెస్కో గుర్తింపు కోసం రామప్పను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో భారత్‌కు రష్యా సహకరించింది. మొత్తం 17 దేశాల ఆమోదం తెలపడంతో రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చింది. యునెస్కో చారిత్రక కట్టడాల జాబితాలో ఇప్పటివరకూ 167 దేశాల నుంచి 1121 కట్టడాలు ఉన్నాయి.

ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో ఉన్న రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చాలాకాలంగా కృషి చేస్తూ వచ్చాయి. ఈ ఆలయానికి మొత్తం 20 అనుబంధ ఆలయాలు ఉన్నాయి. రామప్ప విశిష్ఠతను అంతర్జాతీయంగా చాటి చెప్పేలా కేంద్రం ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఈ బృందం 24 దేశాలకు రామప్ప విశిష్ఠత గురించి వివరించింది. ఎట్టకేలకు రామప్ప ఆలయానికి ఇటీవల యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో) గుర్తింపు లభించింది.