MLA Raja singh : రాజాసింగ్‌ను విచారించనున్న పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు ..

MLA Raja singh : రాజాసింగ్‌ను విచారించనున్న పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు ..

Mla Raja Singh to appear before pd act advisory board for inquiry

MLA Raja Singh : చర్లపల్లి జైలులో ఉన్న గోషాహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గురువారం (సెప్టెంబర్ 29,2022) పీడీయాక్ట్ అడ్వైజరీ బోర్డు ముందుకు విచారణకు హాజరుకానున్నారు. రాజా సింగ్ ను పీడీయాక్ట్ బోర్డు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించనుంది.మరోపక్క రాజాసింగ్ కుటుంబ సభ్యులు బోర్డు ముందుకు నేరుగా హాజరుకానున్నారు. రాజాసింగ్ పై పోలీసులు పెట్టిన పీడీ యాక్ట్ కేసు అడ్వయిజరీ బోర్డు ముందుకు రావటంతో ఈరోజు రాజాసింగ్ ను బోర్డు విచారించనుంది. ముగ్గురు రిటైర్డ్ జడ్జిలు, ఓ సామాజిక కార్యకర్తతో ఏర్పాటు చేసిన అడ్వయిజరీ బోర్డు కేసును పరిశీలించనుంది.

చట్టం ప్రకారమే పీడీ యాక్ట్ ను పెట్టారా? లేదా? అనే విషయాన్ని బోర్డు సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించి అన్ని అంశాలను పరిశీలించనున్నారు. ఈ కేసుకు సంబంధించిన పోలీసులు ఇచ్చిన డాక్యుమెంట్లను పరిశీలిస్తారు. ఈ పీడియాక్ట్ బోర్డు విచారణ రాజాసింగ్ బెయిల్ విషయంలో కీలకంగా మారనుంది. పీడీయాక్ట్ అడ్వైజరీ బోర్డులో రాజాసింగ్ కు ఊరట లభిస్తుందని రాజాసింగ్ అభిమానులు ఆశిస్తున్నారు. ఊరట లభించాలని ఆకాంక్షిస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఎమ్మెల్యే రాజాసింగ్ ను ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద పోలీసులు ఆగస్టు 25న అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు. పీడీ యాక్ట్ కు సంబధించి 32 పేజీల డ్యాక్యుమెంట్ ను పోలీసులు రాజాసింగ్‌కు ఇచ్చారు. దేశవ్యాప్తంగా 101 కేసులు నమోదయ్యాయని.. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా రాజాసింగ్ వ్యాఖ్యలు వున్నాయని పేర్కొన్నారు. యూట్యూబ్ ఛానెల్ ద్వారా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో పలు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయని పోలీసులు తెలిపారు. వివాదాస్పద కామెంట్లు చేయవద్దని పలుమార్లు హెచ్చరించినా రాజాసింగ్ పట్టించుకోలేదని..పదే పదే రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినందునే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు పోలీసులు.

BJP MLA Raja singh Arrested : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

మరోవైపు పీడీ యాక్ట్ ను రీవోక్ చేయాలని హైకోర్టులో రాజాసింగ్ కుటుంబ సభ్యులు పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని 14, 21 అధికారాలకు ఉల్లంఘిస్తూ ఆగస్టు 26 నుంచి రాజా సింగ్ ను అక్రమంగా నిర్బంధించారని తమ పిటిషన్ లో రాజా సింగ్ భార్య ఆరోపించారు. కేసుల గురించి చెప్పకుండానే పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయడం అన్యాయమన్నారు. రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె కోరారు. ఈ పిటిషన్ విచారణకు తెలంగాణ హైకోర్టు నాలుగు వారాలకువాయిదా వేసింది.