MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఇద్దరికి మరో ఛాన్స్..? ఎల్.రమణ పేరు దాదాపుగా ఖరారు?

తెలంగాణలో ఖాళీ అయిన శాసనమండలి స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఎమ్మెల్యే కోటాలో ఆరు స్థానాలు, గవర్నర్ కోటాలో ఒక స్థానం జూన్ 3న ఖాళీ అయ్యాయి. ఈ ఎన్నికలకు సంబంధించి

10TV Telugu News

MLC Elections : తెలంగాణలో ఖాళీ అయిన శాసనమండలి స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఎమ్మెల్యే కోటాలో ఆరు స్థానాలు, గవర్నర్ కోటాలో ఒక స్థానం జూన్ 3న ఖాళీ అయ్యాయి. ఈ ఎన్నికలకు సంబంధించి వచ్చే వారంలోనే నోటిషికేషన్ వచ్చే అవకాశం ఉంది.

వారంలో నోటిఫికేషన్ వచ్చే చాన్స్ ఉండటంతో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది. చట్టసభలో ప్రాతినిధ్యం లేని వర్గాలకు పెద్దపీట వేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక పద్మశాలి సామాజికవర్గం నుంచి ఎల్ రమణ పేరు దాదాపు ఖరారైంది. మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎర్రోళ్ల శ్రీనివాస్ కు చాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది.

* తాజా మాజీ ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆకుల లలితకు మరో ఛాన్స్..?
* పద్మశాలి సామాజికవర్గం నుంచి ఎల్ రమణ పేరు దాదాపుగా ఖరారు
* మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎర్రోళ్ల శ్రీనివాస్ కు చాన్స్..?
* రేసులో మాజీ మంత్రులు కడియం శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల, ఫరీదుద్దీన్
* రెడ్డి సామాజికవర్గం నుంచి తెరపైకి కోటిరెడ్డి, శశిధర్ రెడ్డి, శ్రవణ్ రెడ్డి పేర్లు
* బీసీల్లో మాజీ విప్ కర్నె ప్రభాకర్, పీఎల్ శ్రీనివాస్ పేర్లు
* ముదిరాజ్ సామాజికవర్గంలో ఒకరికి చాన్స్…?
* గవర్నర్ కోటాలో దేశపతి శ్రీనివాస్ లేదా దేవి ప్రసాద్ లో ఒకరికి అవకాశం

10TV Telugu News