Kalvakuntla Kavitha: అదానీ గురించి పార్లమెంటులో ప్రధాని మోదీ జవాబు చెప్పలేదు: ఎమ్మెల్సీ కవిత

పార్లమెంటులో ఆయా అంశాలపై చర్చ జరగాలని విపక్షాలు ఎంతగా అడుగుతున్నా మోదీ దాని గురించి కనీసం మాట్లాడలేదని కవిత అన్నారు. అదానీ అంశంపై జవాబు చెప్పలేదని విమర్శించారు. రైతుల గురించి మోదీ అసత్యాలు చెప్పారని అన్నారు. దేశంలో రైతులకు అందిస్తున్న ఆర్థిక సాయం లెక్కలు ఒకలా ఉంటే మోదీ మరోలా చెప్పారని తెలిపారు. 11 కోట్ల మంది రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని మోదీ అసత్యాలు చెప్పారని, నిజానికి 3.87 కోట్ల మంది రైతులకే సాయం చేస్తున్నారని అన్నారు.

Kalvakuntla Kavitha: అదానీ గురించి పార్లమెంటులో ప్రధాని మోదీ జవాబు చెప్పలేదు: ఎమ్మెల్సీ కవిత

Kalvakuntla Kavitha: పార్లమెంటులో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఇవాళ ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ… అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక, తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం జాయింట్‌ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదానీ గ్రూప్ వ్యవహారంపై విచారణ జరిపించాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందని అన్నారు. అదానీ కంపెనీల్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెట్టుబడులు ఉన్నాయని చెప్పారు.

పార్లమెంటులో ఆయా అంశాలపై చర్చ జరగాలని విపక్షాలు ఎంతగా అడుగుతున్నా మోదీ దాని గురించి కనీసం మాట్లాడలేదని అన్నారు. అదానీ అంశంపై జవాబు చెప్పలేదని విమర్శించారు. రైతుల గురించి మోదీ అసత్యాలు చెప్పారని అన్నారు. దేశంలో రైతులకు అందిస్తున్న ఆర్థిక సాయం లెక్కలు ఒకలా ఉంటే మోదీ మరోలా చెప్పారని తెలిపారు. 11 కోట్ల మంది రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని మోదీ అసత్యాలు చెప్పారని, నిజానికి 3.87 కోట్ల మంది రైతులకే సాయం చేస్తున్నారని అన్నారు.

అంతేగాక, లబ్ధిదారుల సంఖ్యను కేంద్ర సర్కారు ప్రతి ఏడాది తగ్గిస్తూ వస్తోందని చెప్పారు. కాగా, లోక్ సభ నుంచి ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ప్రసంగం సమయంలో వారు సభలో లేరు. అదానీ గ్రూప్ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూ లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు. అదానీ అంశంపైనే పార్లమెంటులో ప్రతిరోజు గందరగోళం నెలకొంటోంది.

PM Modi: అదానీని వదలని అపోజిషన్.. యూపీఏ స్కాంలను ఎకరువు పెట్టిన పీఎం మోదీ