మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు పోలింగ్ స్టార్ట్ అయ్యింది. సోమవారం(జనవరి 22,2020)

  • Published By: veegamteam ,Published On : January 22, 2020 / 01:31 AM IST
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు పోలింగ్ స్టార్ట్ అయ్యింది. సోమవారం(జనవరి 22,2020)

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు సోమవారం(జనవరి 22,2020) ఉదయం 7 గంటలకు పోలింగ్ షురూ అయ్యింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

9 కార్పొరేషన్లలోని 324 డివిజన్‌లలో పోలింగ్ జరుగుతోంది. కార్పొరేషన్లలో 14 వందల 38 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అటు 120 మున్సిపాలిటీల్లోని 2 వేల 647 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 53 లక్షల 50 వేల 255 మంది ఓటర్లున్నారు. మున్సిపాలిటీల్లో 40 లక్షల 36 వేల 346  మంది ఓటర్లుండగా కార్పొరేషన్‌లలో 13 లక్షల 13 వేల 909 మంది ఓటర్లున్నారు.

మొత్తం 7 వేల 961 పోలింగ్ స్టేషన్లు ఉండగా మున్సిపాలిటీల్లో 6 వేల 188 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. కార్పొరేషన్‌లలో 17వందల 73 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 2 వేల 72 పోలింగ్ స్టేషన్లలో వీడియో కవరేజ్‌ ద్వారా పర్యవేక్షించనున్నారు. 2 వేల 406 పోలింగ్ కేంద్రాలను వెబ్‌ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. 2 వేల 53 పోలింగ్ స్టేషన్లను మైక్రో అబ్జర్వర్లు పర్యవేక్షించనున్నారు. 50 వేల మంది పోలీస్‌ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశంలోనే తొలిసారిగా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ వినియోగిస్తుంది ఎన్నికల సంఘం. కొంపల్లిలోని 10 పోలింగ్ బూత్‌లలో పైలట్ ప్రాజెక్ట్‌గా యాప్‌ను వాడుతోంది.

మొత్తం 12 వేల 898 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి బరిలో 2 వేల 972 మంది అభ్యర్థులున్నారు. కాంగ్రెస్‌ నుంచి పోటీలో 2 వేల 616 మంది అభ్యర్థులున్నారు. బీజేపీ నుంచి బరిలో 2 వేల 313 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి 347మంది.. ఎంఐఎం 276 స్థానాల్లో పోటీ చేస్తోంది. సీపీఐ నుంచి 177 మంది, సీపీఎం నుంచి 166 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పలు గుర్తింపు పొందిన పార్టీల నుంచి 281 మంది పోటీ పడుతుండగా.. 3 వేల 750 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు.

ఎన్నికల్లో తెలుపు రంగు బ్యాలెట్‌ పేపర్‌ను వినియోగిస్తున్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఇవాళ(జనవరి 22,2020) సెలవు ప్రకటించారు అధికారులు. పోలింగ్‌ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు, బల్క్ మెస్సేజ్‌లను నిషేధించారు. ఈ నెల 25న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

* 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు పోలింగ్‌
* ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌
* మొత్తం ఓటర్లు- 53,50,255
* మున్సిపాలిటీలలోని ఓటర్లు-40,36,346
* కార్పొరేషన్‌లలోని ఓటర్లు -13,13,909
* మొత్తం పోలింగ్ స్టేషన్లు- 7961
* మున్సిపాలిటీల్లో పోలింగ్ స్టేషన్లు-6,188
* కార్పొరేషన్లలో పోలింగ్ స్టేషన్లు-1,773
* వీడియో కవరేజ్‌ ఉన్న పోలింగ్ స్టేషన్లు- 2,072
* వెబ్‌ కాస్టింగ్- 2,406
* 2,053 పోలింగ్ స్టేషన్లను పర్యవేక్షించనున్న మైక్రో అబ్జర్వర్లు
* విధుల్లో 50వేల మంది పోలీస్‌ సిబ్బంది

అభ్యర్థుల వివరాలు:
మొత్తం అభ్యర్థులు- 12,898 
టీఆర్‌ఎస్‌ నుంచి బరిలో 2,972 మంది అభ్యర్థులు
కాంగ్రెస్‌ నుంచి పోటీలో 2,616  మంది అభ్యర్థులు
బీజేపీ నుంచి బరిలో 2,313 మంది అభ్యర్థులు
టీడీపీ నుంచి 347మంది అభ్యర్థులు
ఎంఐఎం 276 స్థానాల్లో పోటీ
సీపీఐ నుంచి 177 మంది అభ్యర్థులు
సీపీఎం నుంచి 166 మంది అభ్యర్థులు
పలు గుర్తింపు పొందిన పార్టీల నుంచి 281 మంది పోటీ
స్వతంత్ర అభ్యర్థులు 3,750 మంది

పోలింగ్‌ వివరాలు:
120 మున్సిపాలిటీల్లో మొత్తం వార్డులు- 2,727 
80 వార్డులు ఏకగ్రీవం
120 మున్సిపాలిటీల్లోని 2,647 వార్డులకు పోలింగ్‌
9 కార్పొరేషన్లలో మొత్తం డివిజన్లు-325
ఒక కార్పొరేషన్ ఏకగ్రీవం
324 డివిజన్‌లలో పోలింగ్
80 వార్డుల్లో టీఆర్‌ఎస్‌, 3 వార్డుల్లో ఎంఐఎం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎంపిక

ఓటర్ల సంఖ్య:
మొత్తం ఓటర్లు- 53,50,255
మున్సిపాలిటీలలోని ఓటర్లు-40,36,346    
కార్పొరేషన్‌లలోని ఓటర్లు -13,13,909
మొత్తం పోలింగ్ స్టేషన్లు- 7961  
మున్సిపాలిటీల్లో పోలింగ్ స్టేషన్లు-6,188
కార్పొరేషన్లలో పోలింగ్ స్టేషన్లు-1,773  
2,072 పోలింగ్ స్టేషన్లలో వీడియో కవరేజి
2,406 పోలింగ్‌ బూత్‌లలో వెబ్‌ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ
2,053 పోలింగ్ స్టేషన్లను పర్యవేక్షించనున్న మైక్రో అబ్జర్వర్లు
విధుల్లో 50 వేల మంది పోలీస్‌ సిబ్బంది 

అభ్యర్థుల వివరాలు:
మొత్తం అభ్యర్థులు- 12,898 
టీఆర్‌ఎస్‌ నుంచి బరిలో 2,972 మంది అభ్యర్థులు
కాంగ్రెస్‌ నుంచి పోటీలో 2,616  మంది అభ్యర్థులు
బీజేపీ నుంచి బరిలో 2,313 మంది అభ్యర్థులు
టీడీపీ నుంచి 347మంది అభ్యర్థులు
ఎంఐఎం 276 స్థానాల్లో పోటీ
సీపీఐ నుంచి 177 మంది అభ్యర్థులు
సీపీఎం నుంచి 166 మంది అభ్యర్థులు
పలు గుర్తింపు పొందిన పార్టీల నుంచి 281 మంది పోటీ
స్వతంత్ర అభ్యర్థులు 3,750 మంది

పోలింగ్‌ డిటెయిల్స్:
120 మున్సిపాలిటీల్లో మొత్తం వార్డులు- 2,727 
80 వార్డులు ఏకగ్రీవం
120 మున్సిపాలిటీల్లోని 2,647 వార్డులకు పోలింగ్‌
9 కార్పొరేషన్లలో మొత్తం డివిజన్లు-325
ఒక డివిజన్‌ ఏకగ్రీవం
324 డివిజన్‌లలో పోలింగ్

Also Read : రూల్ 71 అంటే ఏమిటి