Telangana Municipal Elections : తెలంగాణ మన్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
తెలంగాణ మన్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు.. సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూర్ మున్సిపాలిటీల్లో మొత్తం 15 వందల 39 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.

Telangana Municipal Elections Polling Begin
Telangana Municipal Election : తెలంగాణ మన్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు.. సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూర్ మున్సిపాలిటీల్లో మొత్తం 15 వందల 39 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 9 వేల 809 మంది పోలింగ్ సిబ్బంది, 4 వేల 557 మంది పోలీసు సిబ్బందిని నియమించింది ఎన్నికల సంఘం. అందరికీ ఫేస్ షీల్డ్, శానిటైజర్లను అందజేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.
వరంగల్ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లకు గాను 878 పోలింగ్ స్టేషన్లను.. ఖమ్మం కార్పొరేషన్‌లో 60 డివిజన్లకు 377 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సిద్దిపేటలో 43 వార్డులుకు గాను 129 పోలింగ్ స్టేషన్లు, అచ్చంపేట మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 40 బూత్‌లను, నకిరేకల్ మున్సిపాలిటీలో 20 వార్డులకు 40 పోలింగ్ స్టేషన్లు, జడ్చర్లలో 27 వార్డులకు 54 పోలింగ్ స్టేషన్లు, కొత్తూరులో 12 వార్డులకు గాను 12 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు అధికారులు.
మొత్తం 11 లక్షల 34 వేల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఆరు అడుగులకు ఒక్కరు చొప్పున క్యూలైన్‌లో నిలబడేట్లు ఏర్పాట్లు చేశారు అధికారులు. మే 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.