Telangana Secretariat: తెలంగాణ నూతన సచివాలయం డ్రోన్ వీడియో .. సాగర తీరాన అద్భుత కట్టడం ..
హైదరాబాద్ నగరంలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంకు సంబంధించిన డ్రోన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. తెలంగాణ చరిత్రను గుర్తుకుతెస్తూ, అధునాతన పద్దతుల్లో ఈ నూతన సచివాలయం నిర్మాణం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సచివాలయాన్ని ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

Telangana Secretariat: తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. ఈ భవనం మొత్తం 11 అంతస్తుల్లో ఉండనుంది. గ్రౌండ్ ఫ్లోర్‌తో సహా ఆరు అంతస్తుల్లో సచివాలయ ప్రధాన భవన నిర్మాణం జరుగుతోంది. మొత్తం 26.98 ఎకరాల్లో నిర్మాణం చేపడుతున్న ఈ నూతన సచివాలయంలో హెలిప్యాడ్‌ను సైతం నిర్మిస్తున్నారు. వచ్చేనెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ నూతన సచివాలయాన్ని ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నూతన సచివాలయం ప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తోపాటు తమిళనాడు, ఝార్కండ్ సీఎంలతో పాటు పలు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. హుస్సేన్ సాగర్ తీరంలో నిర్మాణం చేపడుతున్న ఈ నూతన సచివాలయం ప్రారంభ తేదీ దగ్గర పడుతుండటంతో పనుల్లో వేగం పెంచారు. తెలంగాణ చరిత్రను ప్రతిబింబించేలా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఓ వైపు ఆధునాతన హంగులతో పాటు మరోవైపు చారిత్రక నిర్మాణ శైలి కలబోసి సచివాలయం నిర్మాణం జరుగుతుంది.
An aerial view of Telangana's New Secretariat Building in Hyderabad. The newly-built Dr B R Ambedkar Secretariat of Telangana will be inaugurated on February 17, 2023.
?: @iamsaikanth @TelanganaCMO @TelanganaCS @KTRBRS @VPRTRS @incredibleindia pic.twitter.com/HXwi26BPSx
— Hi Hyderabad (@HiHyderabad) January 28, 2023
తాజాగా నూతన సచివాలయం భవనంకు సంబంధించిన డ్రోన్ వీడియోను వైరల్‌గా మారింది. ఈ వీడియోలో నూతన సచివాలయం అద్భుతంగా ఉంది. తెలంగాణ చరిత్రను గుర్తుకుతెస్తూ , అధునాతన పద్దతుల్లో ఈ నిర్మాణం ఉంది. హుస్సేన్ సాగర తీరంలో వావ్ అనేలా ఈ అద్భుత కట్టడం సోషల్ మీడియాలో నెటిజన్లను కనువిందు చేస్తోంది.