Telangana Night Curfew: మే 8 వరకు నైట్ కర్ఫ్యూ పొడగించిన ప్రభుత్వం

రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. రోజుకు పదివేలకు చేరువలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య తక్కువగా ఉన్నా.. పాజిటివ్‌ కేసులు మాత్రం తీవ్ర స్థాయిలో నమోదవుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.

Telangana Night Curfew: మే 8 వరకు నైట్ కర్ఫ్యూ పొడగించిన ప్రభుత్వం

Telangana Night Curfew

Telangana Night Curfew: రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. రోజుకు పదివేలకు చేరువలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య తక్కువగా ఉన్నా.. పాజిటివ్‌ కేసులు మాత్రం తీవ్ర స్థాయిలో నమోదవుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో కరోనా కట్టడికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేటితో రాత్రి పూట విధించిన కర్ఫ్యూ ముగుస్తుండగా ప్రభుత్వం మరో వారం రోజులు కర్ఫ్యూను పొడిగించింది. మే 8 వరకు రాష్ట్రంలో కర్ఫ్యూను పొడగిస్తున్నట్లు ప్రభుత్వం హైకోర్టులో వెల్లడించింది.

రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు, తదుపరి చర్యలపై గురువారం నుండి హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలోనే కోర్టు గురువారమే కర్ఫ్యూపై చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఏంటని.. ఒక రోజు ముందే ప్రకటిస్తే నష్టమేమిటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, అడ్వకేట్ జనరల్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. 24 గంటల్లో నిర్ణయం చెప్పాలని ఆగ్రహించింది. కానీ శుక్రవారం ఉదయానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రభుత్వానికి హైకోర్ట్ డెడ్‌లైన్ విధించింది.

24 గంటల సమయం ఇచ్చినా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించిన కోర్టు 45 నిమిషాల్లో నైట్ కర్ఫ్యూపై ప్రభుత్వ నిర్ణయం చెప్పాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే మేమే ఆదేశాలిస్తామని స్పష్టం చేసింది. దీంతో ఈరోజు మధ్యాహ్నానికి కర్ఫ్యూ పొడగింపు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం అదే విషయాన్నీ కోర్టుకు స్పష్టం చేసింది. మరో వారం రోజుల పాటు కర్ఫ్యూను పొడగిస్తున్నట్లుగా అడ్వకెట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. మే 8 ఉదయం ఐదు గంటల వరకు రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది.