Omicron : ఒమిక్రాన్ భయం తెలంగాణ సర్కార్ అలర్ట్, కోవిడ్ బెడ్స్ పెంపు

కోవిడ్ కేసులు పెరుగుతాయన్న అంచనాతో.. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి కోవిడ్ బెడ్స్‌ని 55 వేల 442కు పెంచారు...

Omicron : ఒమిక్రాన్ భయం తెలంగాణ సర్కార్ అలర్ట్, కోవిడ్ బెడ్స్ పెంపు

Omicron Tg

Telangana Omicron : ప్రపంచాన్ని ఒమిక్రాన్ గజగజలాడిస్తోంది. పలు దేశాల్లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతుండడంతో మళ్లీ ఆంక్షల వలయంలోకి వెళ్లిపోతున్నాయి. భారతదేశంలోకి ప్రవేశించదని అనుకున్నా..ఒమిక్రాన్ ఎంట్రీ ఇచ్చేసింది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. పలు రాష్ట్రాల్లో కేసులు రికార్డవుతున్నాయి. దేశంలో 2021, డిసెంబర్ 12వ తేదీ ఆదివారం నాటికి 38 కేసులు నమోదయ్యాయి. ఏపీలో నమోదైనా..అతనికి మళ్లీ టెస్ట్ చేస్తే.. నెగటివ్‌ వచ్చింది. అంటే.. ప్రస్తుతానికి ఏపీలో ఒమిక్రాన్ కేసులు లేనట్టేనంటున్నారు. మరోవైపు…ఒమిక్రాన్ వేరియంట్ భయాలతో.. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.

Read More : Hyderabad Crime : నగరంలో నయామోసం.. నకిలీ డీఎస్పీని అడ్డుపెట్టి రూ.1.2 కోట్లు దోచేశారు

రానున్న రోజుల్లో కోవిడ్ కేసులు పెరుగుతాయన్న అంచనాతో.. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి కోవిడ్ బెడ్స్‌ని 55 వేల 442కు పెంచారు. చాలా మందికి ఆస్పత్రుల్లో చికిత్స అవసరమయ్యే పరిస్థితి లేకపోయినప్పటికీ.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లు ఆస్పత్రుల్లో చేరే అవకాశముందని చెబుతున్నారు. మరో గుడ్ న్యూస్ ఏమిటంటే.. మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ సోకిన 17 మందిలో.. 9 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిపోయారు. వీరిలో.. కొందరికి కోవిడ్ లక్షణాలే కనిపించలేదు. ఇంకొందరిలో స్వల్ప అనారోగ్యమే కనిపించిందని.. మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

Read More : Omicron Andhra Pradesh : ఏపీలోకి ఇలా ఎంటరై.. అలా వెళ్లిపోయిన ఒమిక్రాన్!

అయినప్పటికీ.. ఒమిక్రాన్‌ను లైట్ తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే.. దేశంలో ఒమిక్రాన్ అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్రలోని అంధేరిలో 40 మంది ఒమిక్రాన్ అనుమానిత బాధితులు.. ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో.. 2 వారాలుగా పాజిటివిటీ రేటు పెరుగుతోంది. అవసరమైతే.. ఆ ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ విధించాలని కేంద్రం సూచించింది. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో.. టెస్టులు, వ్యాక్సినేషన్ పెంచాలని కేంద్రం ఆదేశించింది.