Telangana : ఆన్ లైన్ క్లాసులు 5 రోజులు మాత్రమే

3నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం చదివిన ముఖ్యమైన పాఠ్యాంశాలతో బ్రిడ్జికోర్సును విద్యాశాఖ సిద్ధం చేసింది. ఈ నెలంతా విద్యార్థులు బ్రిడ్జి కోర్సునే అభ్యసించాల్సి ఉంటుంది. వారానికి ఐదు రోజులు, ఒక్కో పీరియడ్‌ అరగంట మాత్రమే ఉంటుంది.

Telangana : ఆన్ లైన్ క్లాసులు 5 రోజులు మాత్రమే

Online

Online Classes: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కారణంగా చదువులు ఆగమైపోతున్నాయి. గత సంవత్సరం వైరస్ కారణంగా స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోలేదనే సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా కరోనా వైరస్ పూర్తిగా పోలేదు. అయితే..పాజిటివ్ కేసులు తక్కువగా నమోదవుతుండడంతో ప్రభుత్వం పలు ఆంక్షలను సడలించింది. అయితే..స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు తెరవకపోతే బెటర్ అని భావించింది. అందులో భాగంగా…ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. 3నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి.

గత సంవత్సరం చదివిన ముఖ్యమైన పాఠ్యాంశాలతో బ్రిడ్జికోర్సును విద్యాశాఖ సిద్ధం చేసింది. ఈ నెలంతా విద్యార్థులు బ్రిడ్జి కోర్సునే అభ్యసించాల్సి ఉంటుంది. వారానికి ఐదు రోజులు, ఒక్కో పీరియడ్‌ అరగంట మాత్రమే ఉంటుంది. మొత్తం 240 పాఠ్యాంశాలను ఆన్ లైన్ లో బోధించేందుకు అధికారులు అన్నీ సిద్ధం చేశారు. 3 నుంచి 5వ తరగతి వరకు లెవల్ -1గా, 6, 7 తరగతులను లెవల్ -2 గా, 8-9 తరగతులను లెవల్ – 3గా, 10వ తరగతి విద్యార్థులను లెవల్ – 4గా విభజించారు.
డీడీ యాదగిరి, టీశాట్ విద్యా ఛానళ్ల ద్వారా ప్రసారం చేస్తున్నారు. జులై 01 నుంచి 7వ తరగతి వరకు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.

టీశాట్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు.
మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు.
అరగంటకొక పీరియడ్‌ ఉండనుంది.
డీడీ యాదగిరిలో ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాఠ్యాంశాలను ప్రసారం చేస్తారు.

ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు
అరగంటకో పీరియడ్‌ చొప్పున ఉంటుంది.
దూరదర్శన్‌లో ఉదయం 8:30 నుంచి 10:30 గంటల వరకు.
మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు.

టీశాట్‌ ద్వారా ఒకేషనల్‌ విద్యార్థులకు ఉదయం 7 – 9 గంటల వరకు.
సాయంత్రం 5 నుంచి రాత్రి 8:30 గంటల వరకు.
డిగ్రీ విద్యార్థులకు జూమ్‌, వెబెక్స్‌, గూగుల్‌ మీట్‌ తదితర యాప్‌ల ద్వారా వర్చువల్‌ ఆన్‌లైన్‌ క్లాసులు