CM KCR : ధాన్యం దంగల్, మధ్యాహ్నం సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన ?

మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్‌ అత్యవసర భేటీ కానుంది. ఈ భేటీలో సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ధాన్యం సేకరణపై కీలక ప్రకటన చేస్తారనే...

CM KCR : ధాన్యం దంగల్, మధ్యాహ్నం సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన ?

Trs Paddy Issue

Telangana Paddy Issue : యాసంగి ధాన్యం సేకరణపైనే తెలంగాణ రాష్ట్రంలో జోరుగా చర్చ కొనసాగుతోంది. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. సమయం దగ్గర పడుతున్నా కొద్దీ అందరిలో టెన్షన్ నెలకొంది. బాయిల్డ్‌ రైస్‌ సేకరణపై కేంద్రం మనసు మార్చుకుంటుందా? కేసీఆర్‌ డెడ్‌లైన్‌కు స్పందిస్తుందా? అని అనుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ధాన్యం దంగల్ కు ఎండ్ కార్డు పడుతుందా ? అనేది కాసేపట్లో తేలనుంది. కేంద్రం దిగి వచ్చి ధాన్యం సేకరణపై ఓ ప్రకటన చేస్తే సమస్య పరిష్కారమైనట్లేనని వెల్లడిస్తున్నారు. కానీ.. కేంద్రం తగ్గేదేలే అంటే సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది.

Read More : KCR : పీయూష్ గోయల్ కాదు.. ఆయన గోల్ మాల్: కేసీఆర్

మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్‌ అత్యవసర భేటీ కానుంది. ఈ భేటీలో సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ధాన్యం సేకరణపై కీలక ప్రకటన చేస్తారనే ప్రచారం కొనసాగుతోంది. కేంద్రం దిగిరాకపోతే కేంద్రాన్ని వదిలేది లేదని ఇప్పటికే చాలెంజ్‌ చేశారు కేసీఆర్‌. కేంద్రం మొండి వైఖరి తీరుపై కూడా ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 2022, ఏప్రిల్ 11వ తేదీ సోమవారం ఢిల్లీలో జరిగిన టీఆర్ఎస్ నిరసన దీక్షలో పాల్గొన్న సీఎం కేసీఆర్ కేంద్రంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేసీఆర్‌ వ్యాఖ్యలపై కేంద్రం కూడా స్ట్రాంగ్‌ కౌంటరే ఇచ్చింది. తెలంగాణపై ఎలాంటి వివక్ష చూపడం లేదని.. అన్ని రాష్ట్రాల్లో ధాన్యం సేకరించిన విధంగానే తెలంగాణలో కూడా సేకరిస్తున్నామని క్లారిటీ ఇచ్చింది.

Read More : KCR In Delhi : ధాన్యం దంగల్.. ఢిల్లీ వేదికగా గర్జించిన కేసీఆర్, 24 గంటల డెడ్ లైన్

పంజాబ్‌లో బాయిల్డ్ రైస్‌ను సేకరించడం లేదంటూ.. కేసీఆర్‌ పంజాబ్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చింది. తెలంగాణలో డీసెంట్రలైజ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో బియ్యం సేకరిస్తున్నామని.. పంజాబ్‌ నుంచి నాన్‌ డీసీపీ విధానంలో సెంట్రల్‌ పూల్‌ ద్వారా బియ్యం సేకరించి ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నామని కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ నేటిదాకా ఒకే విధానం అమల్లో ఉందన్నారు. తెలంగాణతోపాటు దక్షిణ భారతదేశం నుంచి ఎఫ్‌సీఐ సేకరించే బాయిల్డ్‌ రైస్‌ను సెంట్రల్‌ పూల్‌ కింద కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు పంపిస్తామన్నారు సుధాంశు పాండే. గతంలో బాయిల్డ్ రైస్‌ను జార్ఖండ్‌, కేరళ, తమిళనాడుకు పంపేవారిమని.. కానీ ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో కూడా దిగుమతి పెరగడంతో ఎఫ్‌సీఐ వద్ద నిల్వలు పేరుకుపోయాయన్నారు. ప్రస్తుతం ఎఫ్‌సీఐ వద్ద 40 లక్షల బాయిల్డ్ రైస్‌ నిల్వలు ఉన్నాయని.. వచ్చే రెండేళ్లకు ఇవి సరిపోతాయన్నారు.

Read More : CM KCR : ఢిల్లీలో సీఎం కేసీఆర్.. చివరి ప్రయత్నంగా కేంద్రంతో చర్చలు, విఫలమైతే

కేంద్రం ఇచ్చిన సమాధానాన్ని బట్టి చూస్తే ధాన్యం సేకరణపై ఎలాంటి ప్రకటన వచ్చే అవకాశం కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తెలంగాణ ప్రభుత్వమే ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కల్లాల దగ్గరకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేయాలా? ఐకేపీ కేంద్రాలను మళ్లీ తెరిపించి కొనుగోలు చేయాలా అనే అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి ఎలాంటి నిర్ణయం వెలువడనుందో కాసేపట్లో తెలుస్తుంది.