CM KCR : టీఆర్ఎస్ కు అధిష్టానం లేదు.. తెలంగాణ ప్రజలే బాస్ లు : సీఎం కేసీఆర్

బీజేపీ- కాంగ్రేస్ అధికారంలోకి వస్తే సిట్ అంటే సిట్- పట్ అంటే పట్ అని సీఎం కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి అధిష్టానం లేదని.. తెలంగాణ ప్రజలే బాస్ లు అని తెలిపారు.

CM KCR : టీఆర్ఎస్ కు అధిష్టానం లేదు.. తెలంగాణ ప్రజలే బాస్ లు : సీఎం కేసీఆర్

Cm Kcr (1)

TRS plenary meetings : బీజేపీ- కాంగ్రేస్ అధికారంలోకి వస్తే సిట్ అంటే సిట్- పట్ అంటే పట్ అని సీఎం కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి అధిష్టానం లేదని.. తెలంగాణ ప్రజలే బాస్ లు అని తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. అద్భుతమైన పునాది కలిగివున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు. ఆర్థికంగా బలమైన శక్తిగా ఉందని తెలిపారు. విరాళాల రూపంలో 420కి పైగా కోట్ల నిధులు ఉన్నాయని చెప్పారు.

దేశంలో టీఆర్ఎస్ కు మంచి భవిష్యత్తు ఉందన్నారు. ఏ పని చేయాలన్నా అద్భుతమైన పార్టీ సైన్యం కావాలని తెలిపారు. కిరికిరి వాళ్ళు, అవగాహన రాహిత్యం ఉన్న వాళ్ళు అక్కడక్కడా అవాక్కులు- చవాక్కులు వాగుతున్నారని మండిపడ్డారు. దళితబంధు దగ్గరే అభివృద్ధి ఆగదన్నారు.

CM KCR Speech: ఆంధ్రాలో పార్టీ పెట్టమని వేల మంది విజ్ఞప్తి చేస్తున్నారు

దళితబంధు నిధులు చాలా చిన్నవన్నారు. దళితజాతి బిడ్డల్లో రత్నాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఢిల్లీ గులాముల వల్ల దళితబంధు పథకం అమలు కాదని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు పెన్షన్ లేదని విమర్శించారు.