Telangana Police: మాస్కులు ధరించని వారి నుంచి రూ. 37.94 కోట్ల జరిమానా వసూలు

తెలంగాణలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. అనవసరంగా రోడ్లమీదకు వస్తే కేసులు నమోదు చేస్తున్నారు. మాస్క్ ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు.

Telangana Police: మాస్కులు ధరించని వారి నుంచి రూ. 37.94 కోట్ల జరిమానా వసూలు

Telangana Police Fine To No Mask People

Telangana Police: తెలంగాణలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. అనవసరంగా రోడ్లమీదకు వస్తే కేసులు నమోదు చేస్తున్నారు. మాస్క్ ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు. మాస్కులు పెట్టుకోకుండా రోడ్లపైకి వచ్చిన వారికి రూ. 37.94 కోట్ల జరిమానా విధించినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.

కరోనా మెడిసిన్స్ బ్లాక్ మార్కెట్‌పై 160 కేసులు నమోదు చేశామని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి జూన్ 7వ తేదీ వరకు 8.79 లక్షల కేసులు నమోదు చేశామని నివేదికలో పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించనందుకు 48,643 కేసులు నమోదు చెయ్యగా, లాక్ డౌన్, కర్ఫ్యూ ఉల్లంఘనలపై 3.43 లక్షల కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇక మాస్కులు ధరించకుండా బయటకు వచ్చిన వారిని గుర్తించి 4.56 లక్షల కేసులు నమోదు చేసి రూ. 37.94 కోట్ల జరిమానా విధించామని పేర్కొన్నారు.