PM Modi will taste Yadamma cooking : ప్రధాని మోడీ సార్ కు వంట చేసే అవకాశం దక్కటం నా అదృష్టం : యాదమ్మ

దేశ ప్రధానికి వండి, వడ్డించడమంటే..మాటలు కాదు. కనీసం ఫైవ్ స్టార్ హోటల్‌ చెఫ్ రేంజ్ ఉండాలి. కానీ..హైదరాబాద్‌ రానున్న ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఓ సామాన్యురాలి చేతి వంట రుచి చూడబోతున్నారు. ఆమే యాదమ్మ. ప్రధాని మోడీకి వంట చేసే ఛాన్స్ దక్కించుకున్న యాదమ్మ ఏమంటోందంటే..

PM Modi will taste Yadamma cooking : ప్రధాని మోడీ సార్ కు వంట చేసే అవకాశం దక్కటం నా అదృష్టం : యాదమ్మ

Yadamma Special Food For Pm Modi

Modi will taste Yadamma cooking: దేశ ప్రధానికి వండి, వడ్డించడమంటే..మాటలు కాదు. కనీసం ఫైవ్ స్టార్ హోటల్‌ చెఫ్ రేంజ్ ఉండాలి. కానీ..హైదరాబాద్‌ రానున్న ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఓ సామాన్యురాలి చేతి వంట రుచి చూడబోతున్నారు. ఎవరా సామాన్యురాలు? ఆమె చేతి వంటే ప్రధానికి ఎందుకు పెడతారు? అంటే ఏ ప్రాంతానికి వెళ్లినా ఆ ప్రాంతపు వంటకాలు ప్రముఖులకు వడ్డించటం ఆనవాయితీ. ఇదే తెలంగాణ టూర్ లో ప్రధానికి ఓ సామాన్యురాలి చేతి వంట వడ్డించటం వెనుక ఉన్న అసలు విషయం. ఇంతకీ ఎవరామె? ఆమె వంట ప్రత్యేక ఏంటో తెలుసుకుందాం.తెలంగాణ రుచుల తయారీలో మాత్రం అసామాన్యురాలీమె… అందుకే ఏరికోరి ఎంపికచేశారు…ఆమె పేరు యాదమ్మ. కానీ ఆమె చేతి వంట తింటే మరోసారి తిని తీరుతారు అంటారు ఆమె వంట గురించి తెలిసివారంతా..

జులై 2 నుంచి జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యే ప్రధాని నరేంద్రమోదీకి అచ్చ తెలంగాణ వంటలు రుచి చూపించాలని నిర్ణయించారు తెలంగాణ నేతలు. అచ్చ తెలంగాణ వంటల కోసం కరీంనగర్‌ జిల్లాకు చెందిన గూళ్ల యాదమ్మను ఎంపికచేశారు. 29 సంవత్సరాలుగా వంటలు చేస్తూ జీవిస్తున్న యాదమ్మ స్వగ్రామం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం గౌరవెల్లి గ్రామం. 15వ ఏటనే కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన వ్యక్తితో పెళ్లయింది. దీంతో కరీంనగర్‌ చేరుకున్న యాదమ్మ మంకమ్మతోటలో వెంకన్న అనే వ్యక్తి దగ్గర వంటలు నేర్చుకుంది. ఈమె చేసే శాకాహార, మాంసాహార వంటకాలు తిన్నవారు ఆహా అనకుండా ఉండలేరని చెబుతారు.

ఈ సందర్భంగా యాదమ్మ 25 రకాల వంటకాలను వండి వార్చనుంది యాదమ్మ..ప్రధాని మోడీకి వంట చేసే అవకాశాన్ని దక్కించుకున్న యాదమ్మ మాట్లాడుతూ..ప్రధాని మోడీ సాబ్ కు వంట చేసే అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నానంటూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బు అయిపోతు తెలిపింది. అసలు ఇటువంటి అవకాశం తనకు వస్తుందని..అసలు మోడీ సాబ్ ను దగ్గరనుంచి చూస్తానని కూడా అనుకోలేదని అటువంటిది ఆయనకు తాను స్వయంగా వంట చేసే అవకాశం రావటం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది.