Lockdown : బతుకుదెరువు దెబ్బతినొద్దనే లాక్ డౌన్ ఎత్తివేత, ప్రజలు సహకరించాలి..మాస్క్ కంపల్సరీ

లాక్ డౌన్ ఎత్తివేసేందుకు తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే..కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజలు సహకారం కావాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందని కేబినెట్ వెల్లడించింది.

Lockdown : బతుకుదెరువు దెబ్బతినొద్దనే లాక్ డౌన్ ఎత్తివేత, ప్రజలు సహకరించాలి..మాస్క్ కంపల్సరీ

Tg Lock Down

Telangana Removes Lockdown : తెలంగాణలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న లాక్ డౌన్ ను ప్రభుత్వం ఎత్తివేసింది. కరోనా నియంత్రణలోకి వచ్చిందని, ఈ క్రమంలో లాక్ డౌన్ ఎత్తివేసేందుకు తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే..కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజలు సహకారం కావాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందని కేబినెట్ వెల్లడించింది.

2021, జూన్ 19వ తేదీ శనివారం తెలంగాణ కేబినెట్ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఇందులో అనేక అంశాలు చర్చించారు. దేశవ్యాప్తంగానే కాకుండా, పక్కరాష్ట్రాల్లో కూడా కరోనా నియంత్రణలోకి వస్తున్న విషయాన్ని కేబినెట్ పరిశీలించింది. ఇతర రాష్ట్రాలకంటే వేగంగా రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి వచ్చిందని అధికారులు నివేదిక అందించారు. జూన్ 19 వరకు అమల్లో ఉన్న లాక్ డౌన్ ను జూన్ 20వ తేదీ ఆదివారం నుంచి సంపూర్ణంగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది.

లాక్ డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పని సరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం తప్పనిసరిగా వెల్లడించింది. కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలని, అందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని కేబినెట్ స్పష్టం చేసింది. కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణకు., ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని రాష్ట్ర ప్రజలను కేబినెట్ కోరింది.