Telangana : తెలంగాణలో ఒక్కరోజే ఒమిక్రాన్ 12 కేసులు..హాఫ్ సెంచరీ దాటేశాయి

సోమవారం ఒక్కరోజే 12 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ప్రజలు భయపడిపోతున్నారు. మొత్తం రాష్ట్రంలో 56కి కేసుల సంఖ్య చేరుకున్నాయి...

Telangana : తెలంగాణలో ఒక్కరోజే ఒమిక్రాన్ 12 కేసులు..హాఫ్ సెంచరీ దాటేశాయి

Omicron (4)

Telangana Omicron : తెలంగాణలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజుకు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. 2021, డిసెంబర్ 27వ తేదీ సోమవారం ఒక్కరోజే 12 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ప్రజలు భయపడిపోతున్నారు. మొత్తం రాష్ట్రంలో 56కి కేసుల సంఖ్య చేరుకున్నాయి. అయితే..ఈ కేసులు ఏ జిల్లాల్లో నమోదయ్యాయో తెలియాల్సి ఉంది. రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఓ బాధితుడికి ఒమిక్రాన్ సోకడంతో అతడిని హైదరాబాద్ టిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లెటెస్ట్ గా తల్లి, భార్యతో పాటుగా బాధితుడి మిత్రుడికి…కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.

Read More : Pakistan Accident : ఒక్కరోజులోనే వెయ్యి ప్రమాదాలు..చనిపోయింది ఎంత మందో తెలుసా ?

వారి శాంపిళ్లను తీసుకుని జీనోమ్ సీక్వెన్స్ పరీక్షలకు పంపారు. 2021, డిసెంబర్ 27వ తేదీ సోమవారం వారికి సంబంధించిన పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి. వారి ముగ్గురికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారించారు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు గజగజ వణికిపోతున్నారు. ఇప్పటికే గ్రామాన్ని పదిరోజుల పాటు సెల్ఫ్ లాక్ డౌన్ చేస్తున్నట్లు పంచాయితీ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. కొత్తగా ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 2వందల 48 మంది శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ RTPCR టెస్టులు చేయగా ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. తెలంగాణలో ఒమిక్రాన్‌ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 10 మంది కోలుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి 11వేల 493 మంది ప్రయాణికులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.