TS Covid Update : తెలంగాణలో కొత్తగా 13 కోవిడ్ కేసులు నమోదు

తెలంగాణలో ఈరోజు కొత్తగా 13 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇంతవరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 7,91,498 కి చేరింది. 

TS Covid Update : తెలంగాణలో కొత్తగా 13 కోవిడ్ కేసులు నమోదు

Ts Covid Update

TS Covid Update :  తెలంగాణలో ఈరోజు కొత్తగా 13 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇంతవరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 7,91,498 కి చేరింది.  ఇదే సమయంలో 31 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్లారు. దీంతో కోలుకున్నవారి సంఖ్య7,87,173కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 214 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఈరోజు ప్రజారోగ్య,కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కోన్నారు. ఈరోజు అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 10 కేసులు నమోదయ్యాయి.

మరోవైపు రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా సాగుతోంది. రాష్ట్రంలో ఈ రోజు  14, 888 మందికి   వ్యాక్సిన్ వేశారు. ఇంతవరకు రాష్ట్రంలో వ్యాక్సిన్  వేయించుకున్న వారి సంఖ్య 6,15,99,105 కి చేరింది.  ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద 41,84,385 వ్యాక్సిన్ లు సిధ్ధంగా ఉన్నాయి.

రాష్ట్రంలో 15 నుంచి 17 ఏళ్ల లోపు   వారిలో 16,57,580  మందికి మొదటి డోసు వ్యాక్సిన్ వేశారు. ఇదే వయసు వారిలో 13,42,822 మంది రెండో డోసు వ్యాక్సిన్ కూడా వేయించుకున్నారు.  12 నుంచి 14 ఏళ్లలోపు వారిలో 8,89,019  మందికి మొదటి డోసు వ్యాక్సిన్ వేశారు.

Also Read : Road Roller: నడిపిస్తున్న రోడ్ రోలర్ కిందనే పడి మృతి చెందిన డ్రైవర్