తెలంగాణలో కొత్తగా 181 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 181 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న(మార్చి 11,2021) కరోనాతో ఒకరు మరణించారు. గడిచిన 24గంటల్లో 163 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,872 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 733 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 44 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం(మార్చి 12,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

తెలంగాణలో కొత్తగా 181 కరోనా కేసులు

telangana reports 181 corona cases: తెలంగాణలో కొత్తగా 181 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న(మార్చి 11,2021) కరోనాతో ఒకరు మరణించారు. గడిచిన 24గంటల్లో 163 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,872 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 733 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 44 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం(మార్చి 12,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు:
ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. గత 24 గంటల్లో 47వేల 803 మందికి కోవిడ్ టెస్టులు చేయగా 174 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో 60, కృష్ణా జిల్లాలో 26, విశాఖ జిల్లాలో 23 మంది కరోనా బారిన పడ్డారు. విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో 78 మంది కరోనా నుంచి కోలుకున్నారు. చిత్తూరు జిల్లాలో ఇద్దరు వ్యక్తులు మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

ఇండియాలో రికార్డ్ స్థాయిలో కొత్త కేసులు నమోదు:
దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. కొన్నిరోజులుగా రోజువారీ కేసుల్లో గణనీయ పెరుగుదల నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. మొన్న రికార్డ్ స్థాయిలో 22వేల 854 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతకుమించి కొత్త కేసులు బయటపడ్డాయి.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 23వేల 285 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాదిలో 23వేల పైన కేసులు నమోదవడం ఇదే తొలిసారి. గడిచిన 24 గంటల వ్యవధిలో మరో 117 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య లక్షా 58వేల 306కు పెరిగింది. కొన్నిరోజులుగా దక్షిణాఫ్రికా, బ్రిటన్‌ రకం కరోనా వైరస్‌లు దేశంలో వ్యాపిస్తుండటంతో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో శుక్రవారం(మార్చి 12,2021) నాటికి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,13,08,856కు చేరింది.

మహారాష్ట్రలో కరోనా విశ్వరూపం:
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఆ రాష్ట్రంలో కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. గురువారం(మార్చి 11,2021) ఒక్కరోజే అక్కడ 14వేల 317 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 22,66,374కు పెరిగింది.