Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు
తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు కోవిడ్, మరోవైపు ఒమిక్రాన్.. పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు..

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు కోవిడ్, మరోవైపు ఒమిక్రాన్.. పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. నిన్నటితో(1,963) పోలిస్తే కేసులు పెరిగాయి.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 55వేల 883 మందికి కరోనా పరీక్షలు చేయగా… 2వేల 047 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,174 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 178, రంగారెడ్డి జిల్లాలో 140 కేసులు వెల్లడయ్యాయి.
Block Unknown Numbers : ఈ ఆండ్రాయిడ్ ఫోన్లలో గుర్తుతెలియని నెంబర్లను ఇలా బ్లాక్ చేయండి..!
అదే సమయంలో 2వేల 013 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో ముగ్గురు కోవిడ్ తో మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,09,209 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,83,104 మంది ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో 22వేల 048 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,057కి పెరిగింది.
కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ కట్టడికి మళ్లీ కఠినమైన ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. ఇక విద్యాసంస్థలకు ఈనెల 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించేందుకు రెడీ అవుతోంది. సోమవారం(జనవరి 17) మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోంది.
Eating Egg : రోజూ కోడి గుడ్డు తింటే మధుమేహం ముప్పు
ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించనున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి సీఎం కేసీఆర్ ఓ ప్రకటన చేయనున్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తారా? లేక నైట్ కర్ఫ్యూ అమలు చేస్తారా? సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా కట్టడికి వీకెండ్ కర్ఫ్యూలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.16.01.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/vtatgektG8— IPRDepartment (@IPRTelangana) January 16, 2022
- Telangana Covid Update Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే
- Omicron BA.5 : భారత్ లో ఒమిక్రాన్ BA.5 తొలి కేసు నమోదు..తెలంగాణలో గుర్తింపు
- Telangana Covid Bulletin Report : తెలంగాణలో తగ్గిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే
- Telangana Corona Cases Bulletin : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
- Telangana Corona Bulletin Update : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
1Texas School Shooter : అందుకు కారణాలున్నాయి.. నా కుమారుడుని క్షమించండి.. టెక్సాస్ షూటర్ తల్లి ఆవేదన!
2Yasin Malik: ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నట్లు ఓఐసీ వ్యాఖ్యలు: భారత్
3US : ‘మీ భర్తను చంపడం ఎలా?’అనే..ఆర్టికల్ రాసి తన భర్తనే చంపేసిన రచయిత్రి..
4Union Home Ministry : డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్కు క్లీన్చిట్..సమీర్ వాంఖడేపై చర్యలకు కేంద్రం ఆదేశాలు
5Elon musk: ఇండియాలో టెస్లా కార్ల తయారీ కేంద్రం అసాధ్యమేనా? స్పష్టత ఇచ్చిన ఎలన్ మస్క్
6Southwest Monsoon : కేరళ వైపు పయనిస్తున్న నైరుతి రుతుపవనాలు
7జగన్ నీ పతనం మొదలైంది..!
8Boney Kapoor : బోనికపూర్ క్రెడిట్ కార్డు నుంచి 3.82 లక్షలు చోరీ.. పోయినట్టు కూడా తెలీదు..
9వైసీపీపై రామ్మోహన్ నాయుడు ప్రశ్నల వర్షం
10మహానాడు వేదికగా చంద్రబాబు సవాల్…!
-
Cyber Criminals : లోన్ ఇప్పిస్తామని రూ.40,000 కాజేసిన సైబర్ నేరగాళ్లు
-
Jalli Keerthi : ఐఏఎస్ సేవకు అందరూ ఫిదా..వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా తెలంగాణ ఆడబిడ్డ
-
TRS : ఎన్టీఆర్కు ఘనంగా టీఆర్ఎస్ నివాళి..!
-
Unscrupulous activities : ఆంధ్రాయూనివర్శిటీలో అసాంఘీక కార్యకలాపాలు
-
Terrorists Encounter : టీవీ నటిని హత్య చేసిన ఉగ్రవాదుల హతం..హత్య జరిగిన 24 గంటల్లోనే ఎన్కౌంటర్
-
Adilabad : వేరే మతస్తుడిని పెళ్లి చేసుకుందని కూతురు గొంతు కోసి చంపిన తండ్రి
-
IPL 2022: ఆర్సీబీ కల చెదిరే.. 15 ఏళ్లుగా టైటిల్ పోరాటం.. ఈ పెయిన్ కోహ్లీకి మాత్రమే తెలుసు!
-
Minister KTR : మంత్రి కేటీఆర్ యూకే, దావోస్ పర్యటన..తెలగాంణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు