Telangana Corona : తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారీ కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38వేల 085..

Telangana Corona : తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే

Telangana Corona

Telangana Corona : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారీ కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38వేల 085 శాంపిల్స్‌ పరీక్షించగా… 205 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 23శాతం ఎక్కువగా నమోదయ్యాయి. మరో వ్యక్తి కరోనాతో చనిపోయాడు. ఇదే సమయంలో 185 మంది కోవిడ్‌ బాధితులు పూర్తి స్థాయిలో కోలుకున్నారు.

దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,77,546కు చేరుకోగా… రికవరీ కేసులు 6,69,673కు పెరిగాయి. ఇక, మృతుల సంఖ్య 4,002కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,871 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 79 కొత్త కేసులు నమోదు కాగా, హన్మకొండ జిల్లాలో 19, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు వెలుగుచూశాయి.

Cyber Attack : ఇంట్లో అద్దెకు వస్తామని రూ.2 లక్షలు కాజేశారు

ప్రస్తుతం దేశంలో 93,733 యాక్టివ్‌ కేసులున్నాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,46,56,822కు చేరింది. ఇందులో 3,40,89,137 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు మహమ్మారి బారినపడి 4,73,952 ప్రాణాలు కోల్పోయారు. టీకా డ్రైవ్‌లో భాగంగా 129.5 కోట్ల డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది.

కరోనా మహమ్మారి వెలుగు చూసి.. దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. ఈ రెండేళ్ల కాలంలో అనేక కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేశాయి. నిన్నమొన్నటి దాకా అత్యంత ప్రమాదకారిగా డెల్టా వేరియంట్‌ వణికించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్‌ ను తలదన్నే.. ఒమిక్రాన్‌ అనే మరో వేరియంట్‌ బెంబేలెత్తిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టి… సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో… కొత్త వేరియంట్ భయబ్రాంతులకు గురి చేస్తోంది.

గతంలో వచ్చిన వేరియంట్ల కంటే ఇది చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అనేక దేశాలు మళ్లీ ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోయాయి. చాలా దేశాలు ఇప్పటికే విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.

Army Chopper Crash : భారత తొలి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి..20ఏళ్లకే ఆర్మీలో చేరి..

దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ వేరియంట్ ఇప్పటకే 57 దేశాలను చుట్టేసింది. భారత్‌లోకి కూడా ప్రవేశించింది. ఇప్పటివరకు మొత్తం 24 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఒమిక్రాన్‌ వ్యాప్తి దేశంలో దడ పుట్టిస్తోంది. సెకండ్‌ వేవ్‌ మిగిల్చిన నష్టాన్ని మర్చిపోక ముందే.. ఇక, థర్డ్‌ వేవ్‌ ముప్పు తప్పదన్న హెచ్చరికలు కలవర పెడ్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందే. కరోనా నిబంధనలు పాటించాల్సిందే. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. అలాగే అర్హులందరూ తప్పకుండా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలి.