Telangana Corona Bulletin News : తెలంగాణలో కొత్తగా 24 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో..(Telangana Corona Bulletin News)

Telangana Corona Bulletin News : తెలంగాణలో కొత్తగా 24 కరోనా కేసులు

Telangana Covid Report

Telangana Corona Bulletin News : తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 15వేల 561 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 24 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాద్ లో 9 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 6, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 3, వరంగల్ రూరల్ జిల్లాలో 1, హనుమకొండ జిల్లాలో 1, నాగర్ కర్నూలు జిల్లాలో 1, నల్గొండ జిల్లాలో 1, ఖమ్మం జిల్లాలో 1, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1 కేసు వెల్లడయ్యాయి.

అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 25 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 7,91,522 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,87,198 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 213 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4,111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 10వేల 905 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 13 మందికి పాజిటివ్ గా తేలింది.(Telangana Corona Bulletin News)

అటు దేశంలో కరోనా వైరస్‌ పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు వెయ్యికి సమీపంలోనే నమోదవుతున్నాయి. తాజాగా 2.7 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 861 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మరణాలు భారీగా తగ్గాయి. 24 గంటల వ్యవధిలో మరో ఆరుగురు కోవిడ్ తో మరణించారు. ముందురోజు ఆ సంఖ్య 29గా ఉంది.

Corona 4th Wave: దేశంలో కరోనా నాలుగో దశ రానుందా?: నిపుణులు ఏమంటున్నారంటే

ఒక్కరోజు వ్యవధిలో మరో 929 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 11,058కి తగ్గిపోయాయి. ప్రస్తుతం రికవరీ రేటు 98.76 శాతంగా కొనసాగుతుండగా.. క్రియాశీల రేటు 0.03 శాతంగా ఉంది. ఆదివారం కేవలం 2.4 లక్షల మంది మాత్రమే టీకా తీసుకున్నారు. ప్రస్తుతం దేశంలో 18 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషనరీ డోసు కూడా అందిస్తున్నారు. గతేడాది ప్రారంభం నుంచి 185 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

ఇది ఇలా ఉంటే.. దేశంలో కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మళ్లీ ఎప్పుడు పుంజుకుంటుందో తెలియదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. కరోనా నియంత్రణ నిమిత్తం శరవేగంగా వ్యాక్సిన్లు పంపిణీ చేస్తున్నా.. కొత్త వేరియంట్ల రూపంలో మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో కరోనా ఫోర్త్ వేవ్ హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందనే విషయంపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGEI) చీఫ్ డాక్టర్ ఎన్ కే అరోరా మాట్లాడారు. దేశంలో ఒకటి రెండు చోట్ల బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్.. తీవ్రమైన సంక్రమణకు దారితీయనందున ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని ఆయన అన్నారు.(Telangana Corona Bulletin News)

Covid-19 compensation: కొవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారం..60 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చు : సుప్రీంకోర్టు

ఇతర దేశాల నుంచి వస్తే తప్ప, మన దేశంలో XE వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం లేదన్న అరోరా.. అలాంటి పరిస్థితి వస్తే భారత్ లో జూన్-జులై మధ్య కరోనా నాలుగో దశ ఉంటుందని అంచనా వేశారు. మరోవైపు ఇప్పటి వరకు వెలుగు చూసిన అన్ని వేరియంట్లలో Covid -19 XE వేరియంట్ ఆసియాలో తీవ్ర వ్యాప్తిలో ఉందని.. నిత్యం 14 లక్షలకు పైగా కొత్త కరోనా కేసులు ఆసియా దేశాల్లో నమోదు అవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. చైనాలో ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ తీవ్ర వ్యాప్తిలో ఉండగా.. మహమ్మారి కట్టడికి చైనాలో కఠిన లాక్ డౌన్ విధించారని WHO తెలిపింది.