Telangana Covid19 Cases: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు, కొత్తగా 247మంది బాధితులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. కొన్ని రోజులుగా రాష్ట్రంలో 200కు పైగా కేసులు రికార్డ్ అవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా

Telangana Covid19 Cases: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు, కొత్తగా 247మంది బాధితులు

Telangana Covid19 Cases

telangana reports 247 new covid19 cases: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. కొన్ని రోజులుగా రాష్ట్రంలో 200కు పైగా కేసులు రికార్డ్ అవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 247 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,01,769కి చేరింది. నిన్న కొవిడ్‌తో ముగ్గురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1659కి చేరింది.

నిన్న(మార్చి 16,2021) రాత్రి 8 గంటల వరకు 60వేల 527మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం(మార్చి 17,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

గడిచిన 24గంటల్లో కరోనా నుంచి 158 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,98,009కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,101 ఉండగా.. వీరిలో 716 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 29 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు 93,59,772 మందికి కరోనా పరీక్షలు చేశారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇండియాలో కరోనా తీవ్రరూపం, 24 గంటల్లో 28వేల 903 కొత్త కేసులు:
దేశంలో మరోసారి కరోనా వైరస్‌ తీవ్రరూపం దాల్చుతోంది. కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 188మంది కరోనాకు బలయ్యారు. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య సోమవారం 24వేలు ఉండగా.. మంగళవారం(మార్చి 16,2021) నాడు ఆ సంఖ్య 28వేలకు పైగా నమోదైంది. మొత్తం 9.69లక్షల పరీక్షలు చేయగా.. 28వేల 903 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం(మార్చి 17,2021) వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,14,38,734 కి చేరింది. కొత్తగా 17,741 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,10,457,284కు చేరి.. రికవరీ రేటు 96.65 శాతంగా కొనసాగుతోంది.

మరణాల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 188 మంది కరోనా కారణంగా చనిపోయారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య లక్షా 59వేల 044కి చేరింది. మరణాల రేటు 1.39 శాతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2లక్షల 34వేల 406 కి పెరిగింది.

మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగంగా సాగుతోంది. గడిచిన 24గంటల్లో 21లక్షల మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం వ్యాక్సిన్ అందిన వారి సంఖ్య 3,50,64,536కి చేరింది.