Telangana Covid Terror : తెలంగాణలో కరోనా కల్లోలం.. రికార్డ్ స్థాయిలో పెరిగిన కొత్త కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం కొనసాగుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. తాజాగా ఆందోళనకర రీతిలో కొత్త కేసులు నమోదయ్యాయి.

Telangana Covid Terror : తెలంగాణలో కరోనా కల్లోలం.. రికార్డ్ స్థాయిలో పెరిగిన కొత్త కేసులు

Telangana Covid Report

Telangana Covid Terror : తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం కొనసాగుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. దేశంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తెలంగాణలోనూ కరోనా కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో మరోసారి కొవిడ్ కొత్త కేసుల సంఖ్య రెండు వందలు(200) దాటింది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 28వేల 424 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 285 కొవిడ్ కేసులు వచ్చాయి. అత్యధికంగా హైదరాబాద్ లో 188 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 54, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 24గంటల వ్యవధిలో మరో 65 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఊరట కలిగించే విషయమేంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.

COVID-19: డా.ఆంథోనీ ఫాసీకి కొవిడ్ పాజిటివ్

తెలంగాణలో ఇప్పటిదాకా 7లక్షల 95వేల 293 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 89వేల 561 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 1,621 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వల్ల రాష్ట్రంలో ఇప్పటిదాకా 4వేల 111 మంది మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ గురువారం రాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత కేసుల సంఖ్య 285 దాటడం ఇదే తొలిసారి. ఈ నెల 13న 126 కరోనా కేసులు రాగా, 14న ఒక్కసారిగా డబుల్ సెంచరీ మార్కుని(219) అందుకున్నాయి. ఈ నెల 15న 205 కరోనా కేసులు వచ్చాయి. తాజాగా 300లకు చేరువగా కొవిడ్ కేసులు నమోదవడం టెన్షన్ పెడుతోంది.

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఫోర్త్ వేవ్ భయాలను తలుచుకుని ప్రజలు వణికిపోతున్నారు. కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటించాలని చెబుతున్నారు.

అటు దేశంలోనూ కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొన్ని రోజులుగా 8 వేలకు పైగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య తాజాగా 12 వేల మార్కు దాటడం టెన్షన్ పెడుతోంది. ముందురోజు కంటే 38.4 శాతం అధికంగా రావడం ఆందోళన కలిగించే అంశం.

HIV-AIDS: హెచ్ఐవీకి చికిత్స.. కనుగొన్న శాస్త్రవేత్తలు

 

బుధవారం 5.19 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 12వేల 213 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పాజిటివిటీ రేటు 2.35 శాతానికి చేరింది. ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో ఈ స్థాయి వ్యాప్తి కనిపించింది. మహారాష్ట్ర (4,024), కేరళ (3,488), ఢిల్లీ, కర్నాటకతో సహా పలు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా మారింది. ఒక్క ముంబైలోనే 2వేలకుపైగా కేసులొచ్చాయి. ఐదు నెలల తర్వాత అక్కడ అవే అత్యధిక కేసులు కావడం గమనార్హం. ఢిల్లీలో వరుసగా రెండోరోజు 1,100 మందికి పైగా కరోనా బారినపడ్డారు. ఈ రెండేళ్లలో మొత్తం 4.32 కోట్ల మందికి ఈ మహమ్మారి సోకింది.

తాజా విజృంభణతో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 58వేల 215 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం కేసుల్లో దీని వాటా 0.12 శాతంగా ఉంది. 24 గంటల్లో మరో 7వేల 624 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ 4.26 కోట్ల మందికిపైగా కోలుకోవడంతో రికవరీ రేటు 98.66 శాతంగా కొనసాగుతోంది. నిన్న మరో 11 మంది కరోనాతో చనిపోయారు. ఈ ఏడాదిన్నర కాలంలో 195 కోట్లకు టీకా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 15.21 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.