Telangana Corona Cases List : తెలంగాణలో కొత్తగా 30 కరోనా కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 17వేల 806 కరోనా పరీక్షలు నిర్వహించగా, 30 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(Telangana Corona Cases List )

Telangana Corona Cases List  : తెలంగాణలో కొత్తగా 30 కరోనా కేసులు

Telangana Covid Report

Telangana Corona Cases List : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 17వేల 806 కరోనా పరీక్షలు నిర్వహించగా, 30 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్ లో 9 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 5 కేసులు గుర్తించారు. 21 జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో మరో 52 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఎలాంటి కోవిడ్ మరణాలు సంభవించ లేదు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 7,91,181 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,86,578 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 492 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటి వరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,111 గా ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 13వేల 158 కరోనా పరీక్షలు నిర్వహించగా, 41 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(Telangana Corona Cases List )

India Covid-19 : కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం.. మార్చి 31 నుంచి దేశ వ్యాప్తంగా కొవిడ్ నిబంధనలు పూర్తిగా ఎత్తివేత

అటు దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కరోనా కొత్త కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. కొన్ని రోజులుగా 2వేల దిగువనే నమోదవుతున్న కొత్త కేసులు.. తాజాగా 1,200కి తగ్గాయి. మరణాలు కూడా అదే స్థాయిలో తగ్గడం ఊరట కలిగిస్తోంది.

నిన్న 4,32,389 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 1,270 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందురోజు 149గా ఉన్న కరోనా మరణాలు.. 24 గంటల వ్యవధిలో 31కి తగ్గాయి. పలు రాష్ట్రాలు మునుపటి గణాంకాలను సవరిస్తుండటంతో మృతుల సంఖ్యలో ఈ వ్యత్యాసం కనిపిస్తోంది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 5.21 లక్షల మంది కరోనాతో చనిపోయారు. నిన్న 1,567 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.75 శాతానికి చేరింది. ఇక యాక్టివ్ కేసులు 15వేల 859కి పడిపోయాయి. దాంతో మొత్తం కేసుల్లో బాధితుల సంఖ్య 0.04 శాతానికి క్షీణించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. 183 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 4,20,842 మంది టీకా వేయించుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.(Telangana Corona Cases List )

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కొవిడ్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. అయితే మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారమిచ్చారు.

Covid Vaccine: భారత్ లో 12-18 ఏళ్ల వారికి అత్యవసర వినియోగ నిమిత్తం నోవావాక్స్ కు డీజీసీఐ అనుమతి

దేశంలో కొవిడ్ విజృంభించడంతో దాదాపు రెండేళ్ల క్రితం వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కోసం ఈ నిబంధనలను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. కొవిడ్ కట్టడి కోసం 2020 మార్చి 24న విపత్తు నిర్వహణ చట్టం కింద తొలిసారిగా ఈ నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. ఆ తర్వాత కేసుల సంఖ్యను బట్టి పలుమార్లు వీటిలో మార్పులు, చేర్పులు చేసింది. అయితే, గత ఏడు వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే నిబంధనలను పూర్తిగా తొలగించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.