Telangana Corona Cases Update : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
తెలంగాణలో కొన్ని రోజులుగా కరోనా రోజువారీ కేసులు 50కి నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 13వేల 436 కరోనా పరీక్షలు నిర్వహించగా..(Telangana Corona Cases Update)

Telangana Corona Cases Update : తెలంగాణలో కొన్ని రోజులుగా కరోనా రోజువారీ కేసులు 50కి నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 13వేల 436 కరోనా పరీక్షలు నిర్వహించగా, 34 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 21 కొత్త కేసులు వచ్చాయి. అదే సమయంలో మరో 32 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు.
తెలంగాణలో ఇప్పటివరకు 7,92,361 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,87,867 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 383 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4వేల 111 మంది మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. కాగా, క్రితం రోజు 7వేల 960 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 32 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(Telangana Corona Cases Update)
Chinese Vaccines: తప్పంతా వ్యాక్సిన్లదే: చైనాలో కరోనా నియంత్రణపై పనిచేయని నాసిరకం వ్యాక్సిన్లు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఆదివారం 3.36 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 3వేల 207 మందికి పాజిటివ్‌గా వచ్చింది. ముందురోజు కంటే ఏడు శాతం మేర కేసులు తగ్గాయి. 24 గంటల వ్యవధిలో మరో 29 మంది కొవిడ్ తో మరణించారు. ఇప్పటివరకూ 4.31 కోట్ల మందికి పైగా మహమ్మారి బారినపడగా.. 5.24 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం యాక్టివ్ కేసులు 20వేల 403కి చేరాయి. నిన్న 3వేల 410 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. తాజాగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం ఊరటనిస్తోంది. యాక్టివ్ కేసుల రేటు 0.05 శాతంగా కొనసాగుతుండగా.. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. నిన్న 13 లక్షల మందికి పైగా టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ 190 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.(Telangana Corona Cases Update)
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి అదుపులోనే ఉన్నప్పటికీ పలు దేశాల్లో మాత్రం భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ల విజృంభణతో దక్షిణాఫ్రికాలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో అక్కడ కరోనా పాజిటివిటీ రేటు 30శాతం దాటింది. 5 నెలల తర్వాత ఈ స్థాయిలో పాజిటివిటీ రేటు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు.
Oral Covid Vaccine: జబ్బు, వ్యాధి నుంచి ఓరల్ కొవిడ్ వ్యాక్సిన్ కాపాడుతుందంటోన్న స్టడీ
ఒమిక్రాన్ వేరియంట్ సబ్ వేరియంట్ల ప్రభావంతో దక్షిణాఫ్రికాలో కొన్ని రోజులుగా కొవిడ్ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. శనివారం ఒక్కరోజే 8వేల 524 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 31.1శాతం ఉన్నట్లు అక్కడి జాతీయ అంటువ్యాధుల కేంద్రం వెల్లడించింది. అంతకుముందు వేవ్ సమయంలో డిసెంబర్ 5న అక్కడ 32.2శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. ఈ తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ స్థాయిలో రికార్డయ్యింది. దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు కరోనా గరిష్ఠ పాజిటివిటీ రేటు 34.9శాతంగా ఉంది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.09.05.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/VXFgPW8Zjn— IPRDepartment (@IPRTelangana) May 9, 2022
- Telangana Corona Update News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
- Telangana Covid Latest Update : తెలంగాణలో పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే
- Telangana Covid News Report : తెలంగాణలో 400 దాటిన కరోనా యాక్టివ్ కేసులు
- Telangana Covid Cases Update : తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు, కొత్తగా ఎన్నంటే..
- Telangana Covid News Update : తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..
1Tunnel Collapsed : జమ్మూకశ్మీర్ లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
2Jr.NTR Fans : జూ.ఎన్టీఆర్ ఇంటిముందు అర్ధరాత్రి ఫ్యాన్స్ హంగామా..లాఠీచార్జ్ చేసిన పోలీసులు
3Vikram: హీరో నితిన్ చేతికి కమల్ విక్రమ్ తెలుగు రైట్స్..!
4Exorcism : ప్రాణాల మీదకు తెచ్చిన భూతవైద్యం
5Bigg Boss Nonstop: బిగ్ బాస్ విన్నర్ బిందు.. చరిత్ర సృష్టించబోతున్న ఆడపులి?
6YS Viveka Murder Case: విచారణ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం.. హైకోర్టుకు చెప్పిన సీబీఐ!
7CM KCR: నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల కోసం వరస పర్యటనలు!
8Virat Kohli: సీజన్లో తొలి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ
9IPL2022 Gujarat Vs RCB : బెంగళూరు భళా.. కీలక మ్యాచ్‌లో గుజరాత్‌పై విజయం, ఫ్లేఆఫ్స్ ఆశలు సజీవం
10Nikhat Zareen : చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి.. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిఖత్ జరీన్
-
NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
-
Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
-
F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
-
NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!
-
Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
-
F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
-
Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Cardimom : చర్మసౌందర్యానికి మేలుకలిగించే యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు!