Telangana Corona Cases : తెలంగాణలో 4వేలకు చేరువగా కొత్త కేసులు | Telangana Reports 3,980 Corona Cases, Three Deaths

Telangana Corona Cases : తెలంగాణలో 4వేలకు చేరువగా కొత్త కేసులు

తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా..

Telangana Corona Cases : తెలంగాణలో 4వేలకు చేరువగా కొత్త కేసులు

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3వేల 980 కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. నిన్న ఒక్కరోజే 2వేల 398 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 33 వేల 673 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Paneer : బరువు నియంత్రణకు దోహదపడే పన్నీర్..!

రాష్ట్రంలో రికవరీ రేటు 94.89 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 97వేల 113 కోవిడ్ టెస్టులు చేశారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,439 కేసులు వెలుగుచూశాయి. నిన్న 3వేల 603 కరోనా కేసులు వెలుగుచూడగా, ఇవాళ ఆ సంఖ్య 4వేలకు చేరువ కావడం ఆందోళనకు గురి చేస్తోంది.

ఏపీలోనూ కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 14వేల 502 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో ఏడుగురు కోవిడ్ తో చనిపోయారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు చనిపోయారు. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు. మరోవైపు 4వేల 800 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

AP PRC Strike : సమ్మెకే సై అన్న ఉద్యోగ సంఘాలు

ప్రస్తుతం రాష్ట్రంలో 93వేల 305 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన వాటిలో విశాఖలో అత్యధికంగా 1728 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అనంతపురం జిల్లాలో 1610 కేసులు వెలుగుచూశాయి. కాగా, రాష్ట్రంలో నిన్న 14వేల 440 కేసులు నమోదవగా.. ఇవాళ ఆ సంఖ్య మరింత పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది.

×