Telangana Corona Cases : ఒక్కరోజే 4వేలకు పైగా కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో..

Telangana Corona Cases : ఒక్కరోజే 4వేలకు పైగా కరోనా కేసులు

Telangana Corona Cases

Telangana Corona Cases : తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఒక లక్ష 20వేల 215 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 4వేల 207 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,22,403కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,067కి చేరింది. కరోనా నుంచి 1,825 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26వేల 633 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1645 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో (3,557) పోలిస్తే ఇవాళ 650 కేసులు అధికంగా వచ్చాయి. రోజురోజుకి కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Fever : జ్వరంతో బాధపడుతుంటే మాంసాహారం తినకూడదా?

రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం(జనవరి 20) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఫీవర్ సర్వేలో జ్వర లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తామని, జ్వరం ఉన్నవారికి అక్కడికక్కడే హోం ఐసొలేషన్ కిట్లను పంపిణీ చేస్తామని చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో చేసిన ఫీవర్ సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు హరీశ్ రావు. ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరును నీతి ఆయోగ్ ప్రశంసించిందని గుర్తు చేశారు.

ప్రస్తుతం కొంతమందిలో వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని, చాలామంది పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు రావడం లేదని… అందుకే ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్లి పరీక్షలను చేపడుతోందని మంత్రి వెల్లడించారు.

Perni Nani : సమ్మె వద్దు.. చెప్పుడు మాటలు వినొద్దు, జగన్ చాలా బాధపడుతున్నారు

సీఎం కేసీఆర్ సూచనల మేరకు 2 కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హోం ఐసొలేషన్ కిట్లు సిద్ధం చేశామన్నారు. వీటిని గ్రామ స్థాయి వరకు పంపించామని చెప్పారు. రాష్ట్రంలోని 27 వేల పడకలను ఆక్సిజన్ బెడ్లుగా మార్చామని మంత్రి తెలిపారు. 76 ఆసుపత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను నిర్మించుకున్నామని వివరించారు. కరోనా లక్షణాలు ఉంటే దగ్గర్లోని బస్తీ దవాఖానా లేదా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే హోం ఐసొలేషన్ కిట్ ఇస్తారని మంత్రి హరీశ్ రావు తెలిపారు.