Telangana Corona Update News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
రాష్ట్రంలో ఇంకా 424 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 4వేల 111.(Telangana Corona Update News)

Telangana Corona Update News : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 13వేల 086 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 45 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 36 కేసులు వచ్చాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 39 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.
రాష్ట్రంలో ఇంకా 424 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 4వేల 111. నేటి వరకు రాష్ట్రంలో 7,92,571 కరోనా కేసులు నమోదవగా.. 7,88,036 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 13వేల 689 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 52మందికి పాజిటివ్ గా తేలింది.(Telangana Corona Update News)
Kim Jong un: కరోనా ఎఫెక్ట్.. మొదటిసారి మాస్క్ ధరించిన కిమ్.. ఉత్తర కొరియాలో కరోనా విలయం..
అటు, దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. శుక్రవారం 4.86 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2వేల 858 మందికి పాజిటివ్‌గా తేలింది. ఒక్కరోజు వ్యవధిలో మరో 3వేల 355 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా ఉంటున్నాయి.
మహమ్మారి అదుపులో ఉండటంతో యాక్టివ్ కేసులు దిగొస్తున్నాయి. తాజాగా ఆ సంఖ్య 18,096కి తగ్గిపోయింది. రికవరీ రేటు 98.74 శాతంగా ఉండగా.. క్రియాశీల రేటు 0.04 శాతంగా కొనసాగుతోంది. నిన్న మరో 11 మంది కరోనాతో చనిపోయారు. ఇప్పటివరకూ 4.31 కోట్ల మందికి పైగా కరోనా బారినపడగా.. 5.24 లక్షల మందికి పైగా మరణించారు.
North Korea Lock Down : ఉత్తరకొరియాలో కఠిన లాక్‌డౌన్.. కిమ్ అడ్డాలో తొలి కరోనా కేసు..!
నిన్న 15.04 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ 191 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. మరోవైపు విదేశాలకు వెళ్లే భారతీయ పౌరులకు బూస్టర్ డోసు వ్యవధిలో కేంద్రం వెసులుబాటు కల్పించింది. రెండో డోసు, బూస్టర్ డోసు మధ్య అంతరాన్ని 9 నెలల నుంచి 90 రోజులకు కుదించింది.(Telangana Corona Update News)
ఇక కరోనా వైరస్‌కు పుట్టినిల్లు అయిన చైనాలో మాత్రం కొవిడ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గతవారం రోజుల్లో అక్కడి కొవిడ్ కేసుల్లో 145 శాతం పెరుగుదల కనిపించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ వారాంతపు నివేదికలో తెలిపింది. అయితే, కొవిడ్ కట్టడికి చైనా అనుసరిస్తున్న జీరో కొవిడ్ వ్యూహంపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్.. ఇది ఎక్కువకాలం నిలుస్తుందని భావించడం లేదన్నారు. వైరస్ కట్టడికి పలు నగరాల్లో కఠిన లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ వైరస్ ఉధృతిని మాత్రం చైనా నియంత్రించలేకపోతున్న నేపథ్యంలో టెడ్రోస్ ఈ విధంగా మాట్లాడారు. మరోవైపు ఉత్తర కొరియాలో కరోనా తొలి కేసు నమోదైన సంగతి తెలిసిందే.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.14.05.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/aDdDFZkTlz— IPRDepartment (@IPRTelangana) May 14, 2022
- Telangana Corona Cases Bulletin : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
- Telangana Corona Bulletin Update : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
- Telangana Covid Bulletin Update : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
- Telangana Covid Report Update : తెలంగాణలో కరోనా.. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ
- Telangana Covid Update News : తెలంగాణలో తగ్గిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
1Redmi Note 11T Pro : రెడ్మి నుంచి కొత్త Note 11T Pro 5G స్మార్ట్ఫోన్లు.. ఫీచర్లు, ధర ఎంతంటే?
2Liger : అనన్య, ఛార్మి మధ్యలో విజయ్.. ముంబైలో ఎంజాయ్ చేస్తున్న లైగర్ టీం..
3IIT Hyderabad : హైదరాబాద్ ఐఐటీలో మాస్టర్ డిగ్రీ ప్రవేశాలు
4Jinnah Tower: జిన్నా టవర్‌కు పేరు మార్చాలని బీజేపీ డెడ్‌లైన్
5Watching TV : గంటలకొద్ది టీవీ చూసేవారిలో గుండె జబ్బుల రిస్క్ ఎక్కువ.. కొత్త అధ్యయనం హెచ్చరిక!
6kapil sibal : కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కపిల్ సిబాల్..సమాజ్‌వాదీ పార్టీ తరపున రాజ్యసభకు నామినేషన్
7Karthi Chidambaram : నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్న కార్తీ చిదంబరం
8Health tips: మెరిసే చర్మం కావాలా.. అయితే ఇలా ట్రై చేసి చూడండి …
9సీఎం జగన్.. దేశానికి క్షమాపణ చెప్పాల్సిందే..!
10Sugar mountains : సముద్ర గర్భంలో పంచదార కొండలను కనుగొన్న పరిశోధకులు..
-
America Gun Culture : అమెరికాలో రోజుకు 53 మందిని బలి తీసుకుంటున్న తుపాకి
-
Konaseema : పచ్చగా ఉండే కోనసీమ ఎర్రబడిపోయింది
-
Konaseema : నివురుగప్పిన నిప్పులా కోనసీమ
-
Biden Emotional : అమెరికాలో మారణహోమం.. బైడెన్ భావోద్వేగం..!
-
Cooking Oils : వంటనూనెల ధరలు తగ్గించేందుకు కేంద్రం చర్యలు
-
Bharat Bandh : నేడు భారత్ బంద్..కులాల వారీగా జనగణనకు డిమాండ్
-
Cooking Oils : తగ్గనున్న వంటనూనెల ధరలు
-
Dawood Ibrahim : పాకిస్తాన్ లోనే అండర్ వరల్డ్‌డాన్ దావూద్ ఇబ్రహీం