Telangana Corona Cases : తెలంగాణలో 4వేలకు పైగా కరోనా కేసులు నమోదు | Telangana Reports 4,559 New Corona Cases, Two Deaths

Telangana Corona Cases : తెలంగాణలో 4వేలకు పైగా కరోనా కేసులు నమోదు

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. 4వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,13,670 కరోనా టెస్టులు చేయగా..

Telangana Corona Cases : తెలంగాణలో 4వేలకు పైగా కరోనా కేసులు నమోదు

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. 4వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,13,670 కరోనా టెస్టులు చేయగా.. 4,559 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో ఇద్దరు కోవిడ్ తో మరణించారు. అదే సమయంలో 1,961 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 36వేల 269కి పెరిగింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.55శాతం ఉండగా.. రికవరీ రేటు 94.57శాతంగా ఉంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Sanitizers : శానిటైజర్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు.. ముఖ్యంగా మహిళలు, పిల్లలు..

కొత్తగా నమోదైన కొవిడ్‌ కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 1,450 పాజిటివ్‌ కేసులు బయటపడగా.. మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లాలో 432, రంగారెడ్డి 322, హనుమకొండ 201, ఖమ్మం 145, కరీంనగర్‌ 112, నల్గొండ జిల్లాలో 138 కొత్త కేసులు వచ్చాయి. నిన్న 3వేల 980 కరోనా కేసులు నమోదవగా.. ఈరోజు అంతకుమంచి పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఆందోళనకు గురి చేస్తోంది.

×