Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..

రాష్ట్రంలో ఇంకా 425 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో 7లక్షల 93వేల 090 పాజిటివ్ కేసులు నమోదవగా.. 7లక్షల 88వేల 554 మంది కోలుకున్నారు.(Telangana Covid News)

Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..

Telangana Covid Report

Telangana Covid News : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 13వేల 170 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 46 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 35 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 24 గంటల వ్యవధిలో మరో 38 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు.

రాష్ట్రంలో ఇంకా 425 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111. నేటివరకు రాష్ట్రంలో 7లక్షల 93వేల 090 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 7లక్షల 88వేల 554 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 12వేల 971 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 47 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.(Telangana Covid News)

అటు దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు మూడు వేల లోపు నమోదవుతున్నాయి. గురువారం 4.65 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2వేల 710 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే స్వల్పంగా కేసులు పెరిగాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 2వేల 296 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Watching TV : గంటలకొద్ది టీవీ చూసేవారిలో గుండె జబ్బుల రిస్క్ ఎక్కువ.. కొత్త అధ్యయనం హెచ్చరిక!

కొన్ని రోజులుగా పెరుగుతున్న కొత్త కేసుల ప్రభావం యాక్టివ్ కేసుల సంఖ్యపై పడుతోంది. యాక్టివ్ కేసులు 15వేల 814(0.04శాతం)కి చేరాయి. 2020 ప్రారంభం నుంచి 4.31 కోట్లకు పైగా కరోనా కేసులు రాగా.. 4.26 కోట్ల మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.75 శాతంగా కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో మరో 14 మంది కొవిడ్ తో మరణించారు.

ఇప్పటివరకూ 192 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ కాగా.. నిన్న 14.41 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు జాగ్రత్తలు పాటించడంలో అలసత్వం ప్రదర్శించొద్దన్నారు. మాస్కులు ధరించడాన్ని కొనసాగించాలని కోరారు. కరోనా వైరస్‌ మన నుంచి పూర్తిగా పోలేదన్న ఆయన.. ఆస్పత్రిలో చేరికలు తక్కువగానే ఉన్నప్పటికీ అందరూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని కోరారు.

మాస్క్‌ ధరించడంతో పాటు అర్హులైన వారంతా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సీఎం కోరారు. ప్రస్తుతం 18 ఏళ్లు పైబడిన వారిలో 92.27శాతం మంది వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నారని.. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించామన్నారు.

మరోవైపు, మహారాష్ట్రలో మార్చి 5 తర్వాత తొలిసారిగా 470 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క ముంబైలోనే 295 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఫిబ్రవరి 12 తర్వాత ముంబయిలో ఇంత భారీగా కేసులు రావడం ఇదే తొలిసారి. మహారాష్ట్రలో వీక్లీ పాజిటివిటీ రేటు 1.59శాతంగా ఉండగా.. వీటిలో ముంబై, పుణెలలో రాష్ట్ర సగటు కన్నా అధికంగా ఉంది. ప్రస్తుతం ఒకరు వెంటిలేటర్‌పై ఉండగా.. 18 మంది ఆక్సిజన్‌ సపోర్టుపై ఉన్నట్టు సీఎంవో తెలిపింది.