Telangana Covid Updated List : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే

రాష్ట్రంలో నేటివరకు 8,01,406 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 92వేల 593 మంది కోలుకున్నారు. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది.(Telangana Covid Updated List)

Telangana Covid Updated List : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే

Telangana Covid

Telangana Covid Updated List : తెలంగాణలో కరోనావైరస్ మమహ్మరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తెలంగాణలో వరుసగా 10వ రోజు 400కిపైగా కొవిడ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. మంగళవారం(జూన్ 21) రాష్ట్రంలో 403 కేసులు, బుధవారం(జూన్ 22) 434 కేసులు, గురువారం(జూన్ 23) 494 కేసులు, శుక్రవారం(జూన్ 24) 493 కేసులు, శనివారం(జూన్ 25) 496 కేసులు, ఆదివారం(జూన్ 26) 434 కేసులు, సోమవారం(జూన్ 27) 477 కేసులు, మంగళవారం(జూన్ 28) 459 కేసులు, గురువారం(జూన్ 30) 468 కేసులు నమోదు కాగా.. తాజాగా ఆ సంఖ్య 462గా(జులై 1) ఉంది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 25వేల 518 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 462 మందికి పాజిటివ్ గా తేలింది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 259 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 35, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 40 కేసులు, సంగారెడ్డిలో 15 కేసులు, ఖమ్మంలో 15 కేసులు గుర్తించారు. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 403 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.(Telangana Covid Updated List)

Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!

రాష్ట్రంలో నేటివరకు 8,01,406 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 92వేల 593 మంది కోలుకున్నారు. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది. రాష్ట్రంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల మార్క్ కు చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 702కి పెరిగింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

Light exposure: రాత్రి స‌మ‌యంలో శ‌రీరంపై కాంతి ప‌డేలా నిద్ర‌పోతే ఆరోగ్యానికి ముప్పు

కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలంది. అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించింది. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

మరోవైపు స్వల్ప హెచ్చుతగ్గులతో దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా కొత్త కేసులు కాస్త తగ్గి.. 18 వేల నుంచి 17 వేలకు దిగొచ్చాయి. నిన్న 5.02 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 17వేల 070 మందికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 3.40 శాతంగా నమోదైంది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక సహా పలు రాష్ట్రాల్లో వైరస్ విస్తరిస్తోంది.(Telangana Covid Updated List)

కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరిగింది. యాక్టివ్ కేసులు 1,07,189(0.25 శాతం)కి ఎగబాకాయి. ఒక్కరోజు వ్యవధిలో మరో 14వేల 413 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.55 శాతంగా నమోదైంది. ఇప్పటివరకూ 4.34 కోట్ల మందికి కరోనా సోకగా.. అందులో 4.28 కోట్ల మంది కోలుకున్నారు. నేటివరకు దేశవ్యాప్తంగా 5.25 లక్షల మంది కొవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 23 మంది మరణించారు. ఇక ఇప్పటివరకూ 197 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.