Telangana Corona News Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
రాష్ట్రంలో ఇంకా 417 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. నేటివరకు 7లక్షల 93వేల 044 కేసులు నమోదవగా..(Telangana Corona News Report)

Telangana Corona News Report : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 12వేల 971 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 47 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాద్ లో 26 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 18, హనుమకొండ జిల్లాలో 1, పెద్దపల్లి జిల్లాలో 1, నల్గొండ జిల్లాలో 1 కేసు గుర్తించారు. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 28 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనాతో మరణాలేవీ సంభవించలేదు.
రాష్ట్రంలో ఇంకా 417 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. తెలంగాణలో నేటివరకు 7లక్షల 93వేల 044 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7లక్షల 88వేల 516 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం రాత్రి కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 13వేల 627 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 49మందికి పాజిటివ్ గా తేలింది.(Telangana Corona News Report)
అటు.. దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధవారం 4.52 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2వేల 628 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే 24 శాతం మేర అధికంగా కేసులొచ్చాయి. ఒక్కరోజు వ్యవధిలో మరో 2వేల 167 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.
Watching TV : గంటలకొద్ది టీవీ చూసేవారిలో గుండె జబ్బుల రిస్క్ ఎక్కువ.. కొత్త అధ్యయనం హెచ్చరిక!
కొత్త కేసుల పెరుగుదలతో యాక్టివ్ కేసులు 15వేల 414కు పెరిగాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల రేటు 0.04 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. 24 గంటల వ్యవధిలో మరో 18 మంది కరోనాతో మరణించారు. దేశంలో నేటివరకు కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 5.24 లక్షలు.
మహమ్మారి కట్టడికి కేంద్రం ప్రారంభించిన టీకా కార్యక్రమం కింద 192 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 13.13 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు జాగ్రత్తలు పాటించడంలో అలసత్వం ప్రదర్శించొద్దన్నారు. మాస్కులు ధరించడాన్ని కొనసాగించాలని కోరారు. కరోనా వైరస్ మన నుంచి పూర్తిగా పోలేదన్న ఆయన.. ఆస్పత్రిలో చేరికలు తక్కువగానే ఉన్నప్పటికీ అందరూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని కోరారు.
మాస్క్ ధరించడంతో పాటు అర్హులైన వారంతా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సీఎం కోరారు. ప్రస్తుతం 18 ఏళ్లు పైబడిన వారిలో 92.27శాతం మంది వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారని.. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించామన్నారు.
Dogs: కుక్కలు కారు టైర్లు, పోల్స్‌పై మాత్రమే ఎందుకు మూత్ర విసర్జన చేస్తాయి?
మరోవైపు, మహారాష్ట్రలో మార్చి 5 తర్వాత తొలిసారిగా 470 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క ముంబైలోనే 295 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఫిబ్రవరి 12 తర్వాత ముంబయిలో ఇంత భారీగా కేసులు రావడం ఇదే తొలిసారి. మహారాష్ట్రలో వీక్లీ పాజిటివిటీ రేటు 1.59శాతంగా ఉండగా.. వీటిలో ముంబై, పుణెలలో రాష్ట్ర సగటు కన్నా అధికంగా ఉంది. ప్రస్తుతం ఒకరు వెంటిలేటర్‌పై ఉండగా.. 18 మంది ఆక్సిజన్ సపోర్టుపై ఉన్నట్టు అధికారులు తెలిపారు.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.26.05.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/8yb9FYs5ze— IPRDepartment (@IPRTelangana) May 26, 2022
- Telangana Covid Updated List : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
- Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
- Telangana Covid Bulletin : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
- Telangana Corona Terror News : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
- Telangana Covid Cases Updated : తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్.. భారీగా పెరిగిన కేసులు
1Venu Thottempudi: రామారావు కోసం సీఐగా డ్యూటీ ఎక్కిన వేణు
2Pistachio : పిస్తా పప్పు మోతాదుకు మించి తింటే ఏమౌతుందో తెలుసా!
3Macherla Niyojakavargam: శ్రీకాకుళంలో మాచర్ల మాస్ జాతర!
4YSRCP Plenary : వైసీపీ ప్లీనరీకీ భారీ ఏర్పాట్లు.. 9 తీర్మానాలపై చర్చ
5Arvind Kejriwal: ఢిల్లీలో ‘ఇండియాస్ బిగ్గెస్ట్ షాపింగ్ ఫెస్టివల్’… ప్రకటించిన కేజ్రీవాల్
6IND vs WI : విండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా ధావన్‌కు పగ్గాలు!
7MP Kotagiri Sridhar: దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉంది
8Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్‌డే సేల్ డేట్ ఫిక్స్.. కొత్త స్మార్ట్ ఫోన్లపై అదిరే డీల్స్.. ఏయే ఆఫర్లు, డిస్కౌంట్లు ఉండొచ్చుంటే?
9Punjab CM: రెండో పెళ్లి చేసుకోబోతున్న పంజాబ్ సీఎం
10Sammathame: ఆహాకు సమ్మతమే.. కానీ..!
-
Cardamom : నోటి ఇన్ ఫెక్షన్లతోపాటు, దుర్వాసన పోగొట్టే యాలకులు!
-
SpiceJet: వరుసగా విమాన ప్రమాదాలు.. స్పైస్‌జెట్‌కు డీజీసీఏ నోటీసులు
-
Watermelon Seeds : రక్తపోటును అదుపులో ఉంచే పుచ్చగింజలు!
-
Ginger Tea : వర్షాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే అల్లం టీ!
-
Shruti Haasan: తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్
-
The Warrior: ది వారియర్ కోసం కదిలివస్తున్న కోలీవుడ్.. ఏకంగా 28 మంది!
-
IAF Fighter Jets : హిస్టరీ క్రియేట్ చేసిన తండ్రీకూతురు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఇదే ఫస్ట్!
-
NTR: బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఆర్డర్.. అది మార్చాల్సిందేనట!