Telangana Covid19 : తెలంగాణపై కరోనా పంజా.. కొత్తగా ఎన్ని కేసులంటే..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొన్నిరోజులుగా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నాళ్లుగా 200లకు పైగా కేసులు నమోదవుతుండగా, ఇప్పుడా సంఖ్య 5వందలకు చేరువ కావడం భయాందోళనకు గురి చేస్తోంది.

Telangana Covid19 : తెలంగాణపై కరోనా పంజా.. కొత్తగా ఎన్ని కేసులంటే..

Telangana Reports 495 Fresh Covid 19 Cases

Telangana Covid 19 : తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొన్నిరోజులుగా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నాళ్లుగా 200లకు పైగా కేసులు నమోదవుతుండగా, ఇప్పుడా సంఖ్య 5వందలకు చేరువ కావడం భయాందోళనకు గురి చేస్తోంది. నిన్న(మార్చి 26,2021) రాత్రి 8 గంటల వరకు 58వేల 029 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 495 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,05,804కి చేరింది. క్రితం రోజు ఏకంగా 518 కరోనా కేసులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే.

నిన్న కొవిడ్‌తో ఇద్దరు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 1,685కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 247 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,99,878కి చేరింది.

కాగా, రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం 4వేల 241 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. పది రోజుల కిందట వీటి సంఖ్య 2,101గా ఉండేది. రాష్ట్రంలో 4,241 యాక్టివ్‌ కేసుల్లో 1,616 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 142 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 99,61,154కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శనివారం(మార్చి 27,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

ఏపీలోనూ కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్:
ఏపీలోనూ కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఒక్కసారిగా కొత్త కేసులు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో వెయ్యికి చేరువలో కొత్త కోవిడ్ కేసులు నమోదవడం భయాందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో 40వేల 604 కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 984 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 8,96,863 మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ శుక్రవారం(మార్చి 26,2021) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

అత్యధికంగా గుంటూరు జిల్లాలో 176 కేసులు, విశాఖలో 170, చిత్తూరులో 163, క్రిష్ణా జిల్లాలో 110 కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 306 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 8,85,515 మంది కరోనాను జయించారు. గత 24 గంటల్లో చిత్తూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు కోవిడ్ తో మృతిచెందగా, ఇప్పటివరకు 7,203 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం 4వేల 145 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నేటి వరకు రాష్ట్రంలో కోటి 49లక్షల 16వేల 201 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.