Telangana Covid Latest Update : తెలంగాణలో పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే
తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 13వేల 689 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా..(Telangana Covid Latest Update)

Telangana Covid Latest Update : తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 13వేల 689 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 52 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. క్రితం రోజు 39 కేసులు వచ్చాయి. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ లో 34 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజు వ్యవధిలో మరో 36 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి కరోనా మరణాలు నమోదు కాలేదు.
రాష్ట్రంలో ఇంకా 418 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111. రాష్ట్రంలో నేటివరకు 7,92,526 కరోనా కేసులు నమోదవగా.. 7,87,997 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 13వేల 422 కరోనా పరీక్షలు చేయగా 39 మందికి పాజిటివ్ గా తేలింది.(Telangana Covid Latest Update)
కాగా, దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొద్ది రోజులుగా కొత్త కేసులు మూడు వేలకు దిగువనే నమోదవుతుండటం కాస్త ఊరట కలిగిస్తోంది. దాంతో యాక్టివ్ కేసులు కూడా దిగొస్తున్నాయి.
Booster Dose: విదేశాలు వెళ్లేవాళ్లకు గుడ్ న్యూస్.. బూస్టర్ డోస్ గ్యాప్ తగ్గింపు
గురువారం 4.86 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2వేల 841 మందికి పాజిటివ్‌గా తేలింది. 24 గంటల వ్యవధిలో మరో 3వేల 295 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మరోరోజు కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదు కావడం సానుకూలాంశం. మహమ్మారి కట్టడిలో ఉండటంతో యాక్టివ్ కేసులు 18 వేలకు దిగొచ్చాయి.
సుమారు రెండేళ్ల కాలంలో 4.31 కోట్ల మందికి కరోనా సోకగా.. 4.25 కోట్ల మందికి పైగా కోలుకున్నారు. రికవరీ రేటు 98.74 శాతానికి చేరగా.. క్రియాశీల రేటు 0.04 శాతంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 9 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. నేటివరకు దేశంలో కొవిడ్ మరణాలు 5.24 లక్షలుగా ఉన్నాయి. నిన్న 14.03 లక్షల మంది టీకా తీసుకోగా.. 190 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
మరోవైపు విదేశాలకు వెళ్లే భారతీయులకు బూస్టర్ డోసు విషయంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. తాము వెళ్లాలనుకున్న దేశంలోని నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రికాషనరీ డోసు తీసుకోవచ్చని చెప్పింది. ‘విదేశాలకు వెళ్లే భారతీయ పౌరులు, విద్యార్థులు.. వారు వెళ్లాలనుకున్న దేశంలోని నిబంధనలకు తగ్గట్టుగా ప్రికాషనరీ డోసు తీసుకోవచ్చు. ఈ వెసులుబాటు కొవిన్ పోర్టల్‌లో త్వరలో అందుబాటులోకి రానుంది’ అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విట్టర్ లో తెలిపారు.
Zero Covid policy: డబ్ల్యూహెచ్ఓ పై మండిపడ్డ చైనా.. వారికి సలహాలివ్వడం నచ్చదట..
ప్రస్తుతం రెండో డోసుకు, బూస్టర్ డోసుకు మధ్య వ్యవధి తొమ్మిది నెలలుగా ఉంది. అయితే విదేశాలకు వెళ్లాలనుకునే దృష్టిలో ఉంచుకొని దీనిని ఆరు నెలలకు తగ్గించే విషయమై ప్రభుత్వం యోచిస్తోందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ బుధవారం దీనికి సంబంధించిన సిఫార్సులు చేసింది. అయితే మిగతా ప్రజల విషయంలో ఈ నిబంధనలు యథావిధిగానే ఉన్నాయి. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్స్, 60 ఏళ్లు పైబడిన వారికి ఈ జనవరి నుంచి బూస్టర్ డోసులు అందిస్తున్నారు. ఏప్రిల్ నుంచి 18 ఏళ్లు దాటిన వారికి కూడా ఈ డోసులు అందుబాటులో ఉంటున్నాయి.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.13.05.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/BPHWqCxfTh— IPRDepartment (@IPRTelangana) May 13, 2022
- Telangana Corona Cases Bulletin : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
- Telangana Corona Bulletin Update : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
- Telangana Covid Bulletin Update : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
- Telangana Covid Report Update : తెలంగాణలో కరోనా.. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ
- Telangana Covid Update News : తెలంగాణలో తగ్గిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
1Road Accident: పెండ్లి వాహనం బోల్తా.. నలుగురు మృతి
2Cancer Injection : క్యాన్సర్ ను ఖతం చేసే ఇంజెక్షన్.. రోగిపై మొదటిసారి ప్రయోగించిన పరిశోధకులు
3SBI JOBS : ముంబై ఎస్ బీ ఐలో ఉద్యోగాల భర్తీ
4Botsa Satyanarayana: మా నాయకుల ఇండ్లు మేమే తగులబెట్టుకుంటామా: బొత్స
5Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
6Infosys CEO: ఇన్ఫోసిస్ సీఈఓ శాలరీ 43శాతం పెరిగి రూ.71కోట్లు
7Maharashtra : ‘రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికెళ్లి వంట చేసుకో’.. మహిళా ఎంపీపై బీజేపీ నేత వ్యాఖ్యలు
8Chandrababu Naidu: కోనసీమలో చిచ్చు పెట్టింది వైసీపీనే: చంద్రబాబు
9JNAFAU : హైదరాబాద్ జేఎన్ఏఎఫ్ఏయూలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు
10CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!
-
Green Tea : మధుమేహాన్ని అదుపులో ఉంచే గ్రీన్ టీ!
-
Madhuyashki Goud : రేవంత్ రెడ్డికి మధుయాష్కీ గౌడ్ బహిరంగ లేఖ..సంచలన వ్యాఖ్యలు
-
Thirumala : జీడిపప్పు బద్దల తయారీ ప్రారంభించిన టీటీడీ ఈఓ ధర్మారెడ్డి
-
Gopichand: పక్కా కమర్షియల్ నుండి మరో అప్డేట్
-
Warangal : ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం-ఆపరేషన్ కోసం తల పైభాగం తొలగింపు..అతికించకుండానే డిశ్చార్జ్
-
Major: పవన్ కోసం స్పెషల్.. పక్కా అంటోన్న మేజర్!
-
Raviteja: రామారావు డ్యూటీ ఎక్కడం మరింత ఆలస్యం!
-
Revanth Letter PM Modi : ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..తెలంగాణ ప్రజలంటే ఎందుకంత చులకన?