Telangana Corona Latest News : తెలంగాణలో కొత్తగా 17 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 14వేల 337 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 17మందికి పాజిటివ్ గా..(Telangana Corona Latest News)

Telangana Corona Latest News : తెలంగాణలో కొత్తగా 17 కరోనా కేసులు

Telangana Covid Report

Telangana Corona Latest News : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 14వేల 337 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 17మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 12 కేసులు వచ్చాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 24 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.

రాష్ట్రంలో ఇంకా 187 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటివరకు కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111. నేటివరకు రాష్ట్రంలో 7లక్షల 91వేల 709 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 87వేల 411 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.(Telangana Corona Latest News)

Covid Vaccines : భారత్ లో చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్లు!

అటు దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కలకలం చెలరేగింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కొత్త కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. కేరళ, మిజోరం, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియానా వంటి రాష్ట్రాల్లో కూడా వైరస్ ఉనికి చాటుతోంది.

బుధవారం 4.49 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2వేల 380 మందికి పాజిటివ్‌గా తేలింది. ఒక్క ఢిల్లీ నుంచే 1,009 కేసులొచ్చాయి. అక్కడ ఒక్క రోజులో కేసుల్లో 60 శాతం పెరుగుదల కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు పాజిటివిటీ రేటు 5.7 శాతానికి పెరిగింది.

24 గంటల వ్యవధిలో మరో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క కేరళలోనే మృతుల సంఖ్య 53గా ఉంది. ఢిల్లీ, ఒడిశా, మిజోరంలో ఒక్కో మరణం సంభవించింది. నిన్న 1,231 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. గత కొద్దిరోజులుగా కొత్త కేసులు కంటే రికవరీలు తక్కువగా ఉంటున్నాయి. దాంతో యాక్టివ్ కేసులు 13,433కి పెరిగాయి. ప్రస్తుతం రికవరీ రేటు 98.76 శాతం ఉండగా.. క్రియాశీల రేటు 0.03 శాతంగా కొనసాగుతోంది. మరోపక్క నిన్న 15.47 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇప్పటివరకూ 187 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది.(Telangana Corona Latest News)

New Variant In Delhi : ఢిల్లీలో కొత్త వేరియంట్ కలకలం

ఢిల్లీలో ఈ జనవరి నుంచి మార్చి వరకు సంభవించిన కొవిడ్ మృతుల నమూనాలను పరిశీలించగా.. 97 శాతం కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్‌ ఉన్నట్లు తేలింది. 578 నమూనాలను జన్యుక్రమాన్ని విశ్లేషించగా.. 560 నమూనాల్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. మిగిలిన నమూనాల్లో డెల్టా సహా ఇతర వేరియంట్లు ఉన్నట్లు తెలిసింది. ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌లో థర్డ్ వేవ్ కు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణమైన సంగతి తెలిసిందే. అయితే, ఇది స్వల్ప ప్రభావాన్నే చూపడంతో ప్రభుత్వాలు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.