Telangana Covid News Report : తెలంగాణలో 400 దాటిన కరోనా యాక్టివ్ కేసులు

అత్యధికంగా హైదరాబాద్ లో 28 పాజిటివ్ కేసులు వచ్చాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 28 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.

Telangana Covid News Report : తెలంగాణలో 400 దాటిన కరోనా యాక్టివ్ కేసులు

Telangana Covid Report

Telangana Covid News Report : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 13వేల 422 కరోనా టెస్టులు చేయగా.. కొత్తగా 39 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 28 పాజిటివ్ కేసులు వచ్చాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 28 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.

నేటివరకు రాష్ట్రంలో 7,92,474 కరోనా కేసులు నమోదవగా.. 7,87,961 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. నేటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. రాష్ట్రంలో ఇంకా 402 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 14వేల 586 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 46 మందికి పాజిటివ్ గా తేలింది.

Booster Dose: విదేశాలు వెళ్లేవాళ్లకు గుడ్ న్యూస్.. బూస్టర్ డోస్ గ్యాప్ తగ్గింపు

దేశంలో కోవిడ్ మహమ్మారి అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 4.71 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2వేల 827 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మరో రోజు మూడు వేల దిగువనే కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో మరో 3వేల 230 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. తాజాగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం ఊరటనిస్తోంది.(Telangana Covid News Report)

యాక్టివ్ కేసులు 19 వేలకు పడిపోయాయి. సుమారు రెండేళ్లలో 4.31 కోట్ల మందికి పైగా కరోనా బారినపడగా.. 98.74 శాతం మంది వైరస్‌ను జయించారు. ప్రస్తుతం క్రియాశీల రేటు 0.04 శాతానికి తగ్గడం సానుకూలాంశం. గడిచిన ఒక్కరోజు వ్యవధిలో మరో 24 మంది కరోనాతో చనిపోయారు. ఇప్పటివరకూ దేశంలో 5.24 లక్షల మందికి పైగా కొవిడ్ తో మృత్యుఒడికి చేరుకున్నారు. నిన్న 14.85 లక్షల మంది టీకా తీసుకోవడంతో.. మొత్తంగా 190 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

Zero Covid policy: డబ్ల్యూహెచ్ఓ పై మండిపడ్డ చైనా.. వారికి సలహాలివ్వడం నచ్చదట..

 

మరోవైపు విదేశాలకు వెళ్లే భారతీయులకు బూస్టర్ డోసు విషయంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. తాము వెళ్లాలనుకున్న దేశంలోని నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రికాషనరీ డోసు తీసుకోవచ్చని చెప్పింది. ‘విదేశాలకు వెళ్లే భారతీయ పౌరులు, విద్యార్థులు.. వారు వెళ్లాలనుకున్న దేశంలోని నిబంధనలకు తగ్గట్టుగా ప్రికాషనరీ డోసు తీసుకోవచ్చు. ఈ వెసులుబాటు కొవిన్‌ పోర్టల్‌లో త్వరలో అందుబాటులోకి రానుంది’ అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్విట్టర్ లో తెలిపారు.(Telangana Covid News Report)

ప్రస్తుతం రెండో డోసుకు, బూస్టర్ డోసుకు మధ్య వ్యవధి తొమ్మిది నెలలుగా ఉంది. అయితే విదేశాలకు వెళ్లాలనుకునే దృష్టిలో ఉంచుకొని దీనిని ఆరు నెలలకు తగ్గించే విషయమై ప్రభుత్వం యోచిస్తోందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్ ఇమ్యూనైజేషన్ బుధవారం దీనికి సంబంధించిన సిఫార్సులు చేసింది. అయితే మిగతా ప్రజల విషయంలో ఈ నిబంధనలు యథావిధిగానే ఉన్నాయి. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌, 60 ఏళ్లు పైబడిన వారికి ఈ జనవరి నుంచి బూస్టర్ డోసులు అందిస్తున్నారు. ఏప్రిల్ నుంచి 18 ఏళ్లు దాటిన వారికి కూడా ఈ డోసులు అందుబాటులో ఉంటున్నాయి.