Telangana Corona Bulletin Update : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..

అత్యధికంగా హైదరాబాద్ లో 33 కేసులు నమోదయ్యాయి. మరో 28 మంది కోలుకున్నారు. (Telangana Corona Bulletin Update)

Telangana Corona Bulletin Update : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..

Telangana Covid Report

Telangana Corona Bulletin Update : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 12వేల 870 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 45 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 33 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 28 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.

రాష్ట్రంలో ఇంకా 413 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111. నేటివరకు రాష్ట్రంలో 7లక్షల 92వేల 802 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 88వేల 278 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం రాత్రి కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు 12వేల 458 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 47 మందికి పాజిటివ్ గా తేలింది.(Telangana Corona Bulletin Update)

North Korea: నార్త్‌ కొరియాలో కరోనా విలయం.. కషాయాలు, టీలు తాగండి అంటూ సలహా

అటు దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. స్వల్ప హెచ్చు తగ్గుదలతో కొత్త కేసులు 3వేల దిగువనే ఉంటున్నాయి. గురువారం దేశవ్యాప్తంగా 4.51లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2వేల 259 మందికి పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజు (2,364)తో పోలిస్తే కేసులు కాస్త తగ్గాయి. రోజువారీ పాజిటివిటీ రేటు ఒక శాతానికి (0.53శాతం) దిగువనే ఉంది.

ఇక కొత్త కేసుల కంటే రికవరీలు అధికంగా ఉండటం ఊరటనిచ్చే అంశం. తాజాగా 24 గంటల వ్యవధిలో మరో 2వేల 614 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.75శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో ఇంకా 15,044 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల రేటు 0.03శాతంగా ఉంది. 24గంటల వ్యవధిలో మరో 20 మంది కోవిడ్ తో మరణించారు. నేటివరకు దేశంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 5.24 లక్షలు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

Monkeypox: మంకీపాక్స్ అంటే ఏమిటి? దానిని ఎలా గుర్తించాలి.. లక్షణాలేంటి..?

మరోవైపు కరోనా వ్యాప్తిని అదుపులోకి తెచ్చి.. కోట్లాది మంది ప్రాణాలను కాపాడుతున్న బృహత్తర టీకా పంపిణీ కార్యక్రమంలో భారత్‌ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉంది. 2021 జనవరి 16న వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించగా.. ఇప్పటి వరకు 191.96 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి. త్వరలోనే 200 కోట్ల డోసుల మైలురాయిని చేరుకోనుంది.(Telangana Corona Bulletin)

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 191 కోట్ల టీకా డోసులను పంపిణీ చేశామన్న కేంద్ర ఆరోగ్యశాఖ.. ప్రతి లబ్ధిదారునికి వ్యాక్సిన్‌ అందించేలా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ముఖ్యంగా వచ్చే రెండు నెలలు (జూన్‌, జులై) ‘హర్ ఘర్ దస్తక్ 2.0’ పేరుతో ఇంటింటికీ వెళ్లి టీకా పంపిణీ చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలని అన్ని రాష్ట్రాల వైద్యాధికారులకు స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధాశ్రమాలు, స్కూళ్లు, కాలేజీలు, ఖైదీలు, ఇటుక బట్టీల వంటి ప్రాంతాల్లో పనిచేసేవారు, విద్యకు దూరమైన చిన్నారులకు వ్యాక్సిన్‌ అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని తెలిపింది. ముఖ్యంగా 12 నుంచి 14ఏళ్ల పిల్లలకు టీకా పంపిణీ తక్కువగా ఉండడం, మరోవైపు ఆ వయసువారికి కొవిడ్‌ ముప్పు అధికంగా ఉన్నందున వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.