Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్‌లో తొలి అరెస్ట్ .. సీబీఐ అదుపులో రాబిన్ డిస్టలరీస్ MD అభిషేక్ రావు

ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో హైదరాబాద్ తొలి అరెస్ట్ జరిగింది. రాబిన్ డిస్టలరీస్ ఎండీ బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్‌లో తొలి అరెస్ట్ .. సీబీఐ అదుపులో రాబిన్ డిస్టలరీస్ MD అభిషేక్ రావు

Boinapally abhishek rao arrested in delhi liquor scam

Delhi liquor scam..Abhishek Rao arrest : ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో హైదరాబాద్ తొలి అరెస్ట్ జరిగింది. రాబిన్ డిస్టలరీస్ ఎండీ బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఢిల్లీ తరలించారు. లిక్కర్ స్కాంలో సీబీఐ దూకుడు పెంచిన సీబీఐ ఇప్పటికే విజయ్ నాయర్‌ను అరెస్ట్ చేయగా.. తాజాగా హైదరాబాద్‌కు చెందిన బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అరెస్ట్ చేయడం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి ఢిల్లీకి సీబీఐ అధికారులు అభిషేక్ రావును తరలించారు. అభిషేక్‌రావుతో టీఆర్ఎస్ నేతలకు సంబంధాలు ఉన్నాయనే ప్రచారం గతంలో జరిగిన క్రమంలో తాజాగా అభిషేక్ రావు అరెస్ట్ టీఆర్ఎస్ పార్టీలో కూడా ప్రకంపనలు రేపుతోంది. ప్రముఖ బ్యూటీ కంపెనీ అయిన అనూస్ బ్యూటీ పార్లర్ అడ్రస్ తోనే రాబిన్ డిస్టిలరీస్ రిజిస్టర్ ఉంది. మొత్తం తొమ్మిది కంపెనీలో డైరెక్టర్ గా ఉన్న అభిషేక్ రావు అనూస్ బ్యూటీ పార్లర్ అలాగే రాబిన్ డిస్టలరీస్ లో కూడా డైరెక్టర్ గా ఉన్నారు. అభిషేక్ రావు విచారణ తరువాత మరిన్ని అరెస్ట్ జరుగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఢిల్లీ లిక్కర్ స్కాం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతూనే ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సోదాలతో కలకలం రేపిన సీబీఐ, ఈడీ… అరెస్ట్ ల పర్వం కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని అరెస్ట్ చేయగా.. తాజాగా మరొకరిని సీబీఐ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ రావును తాజాగా అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో ఆయనను అరెస్ట్ చేసి ఢిల్లీకి సీబీఐ తరలించింది. ఇప్పటివరకు ఈ స్కాంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులెవ్వరినీ అరెస్ట్ చేయలేదు. తొలిసారి ఒకరిని అరెస్ట్ చేయడంతో లిక్కర్ స్కాం మరోసారి ప్రకంపనలు రేపుతోంది.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ట్విస్ట్.. ఎమ్మెల్సీ కవిత ఫొటోపై రాజకీయ దుమారం

అభిషేక్ రావు అనూస్ బ్యూటీపార్లర్‌లోనే డిస్టిలరీస్ ఏర్పాటు చేసి కార్యకలాపాలు నడిపిస్తున్నట్లు సీబీఐ గుర్తించింది. హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ లిక్కర్ వ్యాపారి రామచంద్రన్ పిళ్లైతో కలిసి అభిషేక్ రావు వ్యాపారం చేస్తున్నట్లు సీబీఐ విచారణలో తేలింది.వీటితో పాటు ఆయన తొమ్మిది కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. లిక్కర్ స్కాంలో ఇప్పటికే విజయ్ నాయర్ ను అరెస్ట్ చేయగా.. అభిషేక్ రావు అరెస్ట్ రెండోది. దీంతో రానున్న రోజుల్లో మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశమంది.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు .. దేశ వ్యాప్తంగా 40 ప్రాంతాల్లో దాడులు

దసరా పండుగ తర్వాత ఈడీ మరింత దూకుడు పెంచింది. దసరా పండుగ ముగియగానే దేశవ్యాప్తంగా పదుల కొద్దీ ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. ఇటీవల హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు, చెన్నై, పంజాబ్, ఢిల్లీలలో పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలక ఆధారాలు సేకరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ సోదాలు ముగిసిన క్రమంలో అభిషేక్ రావును అరెస్ట్ చేయడం చర్చకు దారి తీసింది. టీఆర్ఎస్‌ నేతలతో అభిషేక్ రావుకు సంబంధాలు ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. దీంతో ఇప్పుడు అభిషేక్ రావు అరెస్ట్ తెలంగాణలో సంచలనంగా మారింది.