Half Day Schools : మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు, ప్రభుత్వం ఉత్తర్వులు.. టైమింగ్స్ ఇవే

తెలంగాణలో ఒంటిపూట బడుల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు ఉంటాయి. ఈ మేరకు ఒంటిపూట బడుల నిర్వహణపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Half Day Schools : మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు, ప్రభుత్వం ఉత్తర్వులు.. టైమింగ్స్ ఇవే

Half Day Schools : తెలంగాణలో ఒంటిపూట బడుల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు ఉంటాయి. ఈ మేరకు ఒంటిపూట బడుల నిర్వహణపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ప్రభుత్వ-ప్రైవేట్ హైస్కూల్స్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ కు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని అధికారులు తెలిపారు.

మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 24 వరకు హాఫ్‌ డే తరగతులు కొనసాగుతాయని పేర్కొంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే స్కూళ్లు నిర్వహించాలంది. ఇక, విద్యార్థులకు మ.12.30 గంటల కల్లా మధ్యాహ్న భోజనం అందించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వార్షిక పరీక్షల నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగించాలని ఆదేశాల్లో తెలిపింది.

Also Read..లక్షల మంది విద్యార్థులను ‘లీడ్’ చేస్తున్నారు

టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని చెప్పింది. ఈ మేరకు ప్రాంతీయ విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌.. జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తప్పనిసరిగా ఆదేశాలను అమలు చేయడంతో పాటు పర్యవేక్షించాలని ఆదేశించారు.

Also Read..India : ఒకటో తరగతిలో చేరాలంటే పిల్లలకు ఆరేళ్లు నిండాలి : రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యాశాఖ ఆదేశం

ఇక, కొన్ని రోజుల క్రితమే స్కూళ్లకు వేసవి సెలవులపై ప్రకటన చేశారు అధికారులు. ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ఉంటాయన్నారు. తిరిగి జూన్ 12 స్కూళ్లు రీఓపెన్ అవుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.