TS Politics : కాంగ్రెస్ వన్ ఫ్యామిలీ వన్ టికెట్ ఫార్మలాతో..తెగ టెన్షన్ పడిపోతున్న తెలంగాణ సీనియర్ నేత

కాంగ్రెస్ పార్టీ వన్ ఫ్యామిలీ.. వన్ టికెట్ ఫార్ములాను ఫాలో అవ్వాలని డిసైడ్ అయింది. అయితే.. ఇందులో కొన్ని కండీషన్స్ పెట్టారు.. ఆ కండీషన్స్‌లో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయ్. ఇన్ని పెట్టినా.. తెలంగాణ కాంగ్రెస్‌లోని ఆ పెద్దాయనకు.. మళ్లీ పెద్ద కష్టమే వచ్చిపడింది. ఆ మినహాయింపులు కూడా తనకు వర్తించవని.. బాధపడిపోతున్నారు.

TS Politics : కాంగ్రెస్ వన్ ఫ్యామిలీ వన్ టికెట్ ఫార్మలాతో..తెగ టెన్షన్ పడిపోతున్న తెలంగాణ సీనియర్ నేత

Congress Party One Family One Ticket Formula (1)

Congress party one Family One ticket formula  : ఫ్యామిలీ పాలిటిక్స్‌కి కేరాఫ్‌గా ఉండే కాంగ్రెస్.. ఖతర్నాక్ డెసిషన్ తీసుకుంది. కొత్తగా.. వన్ ఫ్యామిలీ.. వన్ టికెట్ ఫార్ములాను ఫాలో అవ్వాలని డిసైడ్ అయింది. అయితే.. ఇందులో కొన్ని కండీషన్స్ పెట్టారు.. ఆ కండీషన్స్‌లో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయ్. ఇన్ని పెట్టినా.. తెలంగాణ కాంగ్రెస్‌లోని ఆ పెద్దాయనకు.. మళ్లీ పెద్ద కష్టమే వచ్చిపడింది. ఆ మినహాయింపులు కూడా తనకు వర్తించవని.. బాధపడిపోతున్నారు. ఇప్పుడు.. తన రాజకీయ వారసులను ఎలా ప్రమోట్ చేయాలో అర్థంకాక.. ఆగమాగమైపోతున్నారట. టికెట్ ఇంపాజిబుల్‌ని.. పాజిబుల్ చేయడమెలా? అన్న దానిపై.. తెగ లెక్కలేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.

డాక్టర్ల పిల్లలు.. డాక్టర్లుగా.. యాక్టర్ల పిల్లలు యాక్టర్లుగా.. లేని తప్పు.. రాజకీయ నాయకుల పిల్లలు.. రాజకీయ వారసులుగా మారినప్పుడు.. అంతా దెప్పిపొడుస్తుంటారు. నాయకులుగా ఉన్న మేం.. మా పిల్లలను రాజకీయ నేతలుగా తయారుచేయడం తప్పా అని కూడా ప్రశ్నిస్తుంటారు. పైగా.. కాంగ్రెస్ లాంటి వారసుల పార్టీలో.. ఈ వారసత్వ రాజకీయాలు వెరీ కామన్. తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఈ టైప్ ఫ్యామిలీ పాలిటిక్స్ చాలానే నడుస్తున్నాయ్. అయితే.. కాంగ్రెస్‌లోని పెద్దలు జానారెడ్డి గారికి.. ఈ విషయంలో పెద్ద పరేషానే వచ్చిపడింది. తన ఇద్దరు కుమారులు రఘువీర్ రెడ్డి, జయవీర్ రెడ్డిని.. రాజకీయాల్లో సెటిల్ చేసి.. తాను రెస్ట్ తీసుకుందామనుకున్నారు. చాలా కాలంగా.. ఈ టాస్క్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. కానీ.. పొలిటికల్ వెదర్ అనుకూలించలేదు.

Also Read : AP Politics : లోక్‌సభ స్థానాలపై చంద్రబాబు ఫోకస్..స్ట్రాంగ్ అభ్యర్ధుల కోసం వెదుకులాట

గత ఎన్నికల్లోనే.. పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డిని మిర్యాలగూడ నుంచి రంగంలోకి దించాలని చూశారు జానారెడ్డి. కానీ.. అదెందుకో వర్కవుట్ కాలేదు. ఈసారి.. ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఇద్దరు కుమారులను రంగంలోకి దించాలని.. జానారెడ్డి భారీ కసరత్తే చేస్తున్నారట. పెద్ద కొడుకు రఘువీర్‌ను నాగార్జునసాగర్, చిన్న కుమారుడు జయవీర్‌ను మిర్యాలగూడ నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు. ఇదే టైంలో.. తన టైం బాగుండి.. తనకూ ఓ చాన్స్ వస్తే.. నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు.. పెద్ద ప్లానే గీసుకొని రెడీగా ఉన్నారు జానారెడ్డి గారు. కానీ.. వన్ ఫ్యామిలీ-వన్ టికెట్ పేరుతో.. సోనియాగాంధీ ఇచ్చిన సడన్ షాక్‌తో.. పెద్దలు జానారెడ్డి గారికీ.. ఏమీ పాలుపోవడం లేదంటున్నారు.

అయితే.. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న ఈ బిగ్ డెసిషన్‌కి.. కొన్ని మినహాయింపులున్నాయ్. పార్టీ కోసం ప్రత్యక్ష రాజకీయాల్లో ఐదేళ్లు కష్టపడితే.. ఈ కండీషన్ వర్తించదన్నమాట. ఉమ్మడి నల్గొండ జిల్లాలో.. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతికి ఈ విషయంలో రిలీఫ్ దక్కింది. అలాగే.. కోమటిరెడ్డి బ్రదర్స్‌తో పాటు మల్లు రవి, మల్లు భట్టి విక్రమార్క ఫ్యామిలీ కూడా ఈ కండీషన్ నుంచి బయటపడినట్లైంది. కానీ.. ఒక్క జానారెడ్డికి మాత్రమే ఈ రూల్ నుంచి రిలీఫ్ దక్కే చాన్స్ కనిపించడం లేదు. ఆయన ఇద్దరు కుమారులు.. ఇప్పటివరకు పార్టీకి ప్రత్యక్షంగా.. ఐదేళ్ల పాటు సేవ చేసిన రికార్డ్ లేదు. కేవలం ఎలక్షన్ టైంలో.. తండ్రి కోసం పనిచేయడం పతప్ప.. పార్టీ కోసం పనిచేసిన దాఖలాలు లేవు. పార్టీలో.. ఏ పదవి చేపట్టలేదు. వర్క్ చేయలేదు.

Also Read : Hyderabad News: బీర్లు తెగ తాగేస్తున్నారు.. గ్రేటర్ పరిధిలో రికార్డు స్థాయిలో విక్రయాలు..

వచ్చే ఎన్నికల్లో.. కొడుకులిద్దరినీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి తీసుకు రావాలని.. ఎన్నో ఆశలు పెట్టుకున్న జానారెడ్డికి.. సోనియా తీసుకున్న నిర్ణయం పిడుగుపాటులా మారింది. పార్టీలో ఇంత పేరుండి.. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉండి కూడా.. కొడుకులను పాలిటిక్స్‌లోకి తెచ్చేందుకు సరైన ముహూర్తం కుదరట్లేదని.. జానారెడ్డి లోలోపల మదనపడిపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయ్. వచ్చే ఎన్నికల్లో.. ఎలాగైనా ఇద్దరినీ చెరో సెగ్మెంట్‌లో బరిలో నిలపాలని చూస్తే.. హైమాండ్ తీసుకున్న నిర్ణయం మళ్లీ మొదటికి తెచ్చిందని.. పెద్దాయన ఆవేదన చెందుతున్నట్లు.. పార్టీలో టాక్ వినిపిస్తోంది.

ఎన్నికల నాటి వరకు.. పార్టీ తీసుకున్న నిర్ణయంలో.. మళ్లీ ఏవైనా మార్పులు రాకపోవా.. పార్టీ కోసం 40 ఏళ్లుగా తాను పడుతున్న కష్టానికి.. అధిష్టానం సహకరించకపోదా.. అని జానారెడ్డి ఆశగా ఉన్నారు. మరి.. ఆయన ఆశలు ఫలిస్తాయా.. లేదా.. అన్నది తెలియాలంటే.. వచ్చే ఎన్నికల దాకా ఆగాల్సిందే.