Villagers Crazy problem : ఈ పురోహితుడు మాకొద్దు అంటూ గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం..

ఈ పురోహితుడు మాకొద్దు అంటూ గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఆడవారు,మగవారు కలిసి..ఇకనుంచి గ్రామంలో ఎవ్వరు ఆ పురోహితుడితో ఏ కార్యక్రమాలు చేయించుకోవద్దని తీర్మానించుకున్నారు

Villagers Crazy problem : ఈ పురోహితుడు మాకొద్దు అంటూ గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం..

We Do Not Want This Priest

We do not want this priest : పురోహితుడు అంటే పౌరోహిత్యం మీద ఆధారపడి జీవించేవారు. పుర హితవు కోరేవారు పురోహితులు. పూజలు, వ్రతాలు, పెళ్లిళ్లు, గృహప్రవేశాలు చేయించుకున్నవారు ఇచ్చిన దక్షిణ తాంబూలాలు పట్టుకుని వెళ్లతారు. కానీ ప్రస్తుతం పురోహితులు అలా కాదు. పురోహితులు ఈ పెళ్లికి ఇంత..గృహ ప్రవేశానికి ఇంత అంటూ డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. వారు అడిగినంత ఇచ్చుకోవాల్సిందేననంటున్నారు. అలా ఓ పురోహుతుడి దోపిడీ భరించలేక ఓ గ్రామంలో ప్రజలంతా కలిసి ‘‘ఈ పురోహితుడు మాకు వద్దు బాబోయ్..’ అంటూ ఏకతాటిమీద నిలబడ్డారు. అంతేకాదు ఈ పురోహితుడు వద్దు అంటూ ఏక గ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామ సభ నిర్వహించి మరీ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు గ్రామస్తులంతా కలిసి.

Read more :  Woman Dating Offer : వ్యాక్సిన్ వేయించుకుంటే డేటింగ్‌కొస్తా..అందాల భామ ఆఫ‌ర్..టీకా వేయించుకోటానికి క్యూ కట్టిన అబ్బాయిలు

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం బంజేరుపల్లిలో గ్రామస్థులంతా బుధవారం (డిసెంబర్ 1,2021) హనుమాన్‌ ఆలయం వద్ద చేరారు. ‘కట్నం (సంభావన) పేరుతో పురోహితుడు చేస్తున్న దోపిడీని సహించలేకపోతున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు. పెళ్లి, గృహప్రవేశాలు వంటి శుభాకార్యాల కోసం సదరు పురోహితుడు డబ్బులు భారీగా డిమాండ్ చేస్తున్నాడట. తాను అడిగినంత ఇస్తేనే శుభకార్యం జరిపించటానికి కొస్తాను లేకుంటే లేదని తెగేసి చెబుతున్నాడట.

అంతేకాదు..సదరు పురోహిుతుల వారి వేధింపుల్ని ఒకరికొకరు చెప్పుకుని వాపోయారు గ్రామస్తులు. దీంతో మేం ఇంత ఇచ్చుకున్నాం అని ఒకరు అంటే మేం ఇంత ఇచ్చుకోవాల్సి వచ్చిందని మరొకరు ఇలా అంతకలిసి గ్రామసభలో వారి వారి బాధలు వెళ్లబోసుకున్నారు. సదరు పురోహితుడు పెళ్లి చేయాలంటే తులం బంగారం, వధూవరుల కుటుంబాల నుంచి రూ.20-25 వేల డిమాండ్‌ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే గృహ ప్రవేశం కార్యక్రమం అయితే సంభావనగా అర తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని వాపోయారు. ఇలా ఇచ్చుకుంటు పోతే తులం బంగారం కాస్తా రెండు తులాలు చేసి మొత్తం పిండేస్తాడని ప్రస్తుతం బంగారం ధర మామూలుగా లేదని ఇలా ఇచ్చుకుంటు పోతే తీసుకునేవాడికి నొప్పి ఏంటీ ఇక ఈ పురోహితుడితో గ్రామస్తులు ఎవ్వరు పూజలు చేయించుకోవద్దు అంటూ గ్రామసభలో తీర్మానం చేసుకున్నారు.

Read more : 164 Rare Coins : మధ్యప్రదేశ్ లోని ఇసుక క్వారీలో బయటపడ్డ 164 పురాత‌న నాణేలు

ఆర్థిక స్థోమత లేని నిరుపేద కుటుంబాలన కూడా సరదు పురోహితుడు వదలడం లేదని.. అడిగినంత సంభావన ఇవ్వకపోతే..ఏ శుభకార్యం జరిపించేది లేదంటున్నాడని తెలిపారు గ్రామస్తులు. పైగా తనను కాదని గ్రామంలో పౌరోహిత్యం ఎవరు చేస్తారో చూస్తానంటూ బెదిరిస్తున్నాడని సదరు పురోహితుడు దోపిడీ పెరిగిపోతోందంటు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు గ్రామస్తులు.

అడిగినంత సంభావన ఇవ్వకపోతే కార్యక్రమాలు చేయటనాకి రాకపోగా..పైగా శాపనార్థాలు పెట్టుకుంటూ వెళ్తున్నాడని..కొన్ని సమయాల్లో అశుభం జరిగితే తన శాపనార్థాలతోనే అలా జరిగింది..పురోహితుడి నోట అంటే జరిగి తీరుతుంది జాగ్రత్త అంటూ బెదిరిస్తున్నాడని వాపోయారు.ఇలా తమను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. ఇలాంటి పురోహితుడు తమ గ్రామానికి అవసరం లేదంటూ గ్రామ పెద్దలంతా కలిసి తీర్మానం చేశారు. అనంతరం ఆ పురోహితుడిని కార్యక్రమాలకు ఎవ్వరూ ఆహ్వానించవద్దంటూ గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు.