Singer Sravani : కేటీఆర్ స‌ర్‌.. నా ప్రామిస్ నిలబెట్టుకున్నా – దేవి శ్రీ

కొద్దీ రోజుల క్రితం తెలంగాణ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా నుంచి యువ గాయ‌ని శ్రావ‌ణి టాలెంట్‌కు సంబంధించిన వీడియో షేర్ చేసి సంగీత ద‌ర్శ‌కులు థ‌మ‌న్, దేవి శ్రీ ప్ర‌సాద్‌ల‌ని ట్యాగ్ చేశాడు. కేటీఆర్ ట్వీట్ పై స్పందించిన దేవి శ్రీ ప్రసాద్.. శ్రావణి టాలెంట్ కు ఫిదా అయ్యానని, రీట్వీట్ చేశారు. భవిష్యత్ లో నిర్వహించే షోలలో శ్రావణికి తప్పకుండా అవకాశం ఇస్తామని తెలిపాడు దేవి శ్రీ.  ఇచ్చిన మాట ప్రకారం ఆమెను ఓ షోకు తీసుకెళ్లారు.

Singer Sravani : కేటీఆర్ స‌ర్‌.. నా ప్రామిస్ నిలబెట్టుకున్నా – దేవి శ్రీ

Singer Sravani

Singer Sravani : కొద్దీ రోజుల క్రితం తెలంగాణ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా నుంచి యువ గాయ‌ని శ్రావ‌ణి టాలెంట్‌కు సంబంధించిన వీడియో షేర్ చేసి సంగీత ద‌ర్శ‌కులు థ‌మ‌న్, దేవి శ్రీ ప్ర‌సాద్‌ల‌ని ట్యాగ్ చేశాడు. కేటీఆర్ ట్వీట్ పై స్పందించిన దేవి శ్రీ ప్రసాద్.. శ్రావణి టాలెంట్ కు ఫిదా అయ్యానని, రీట్వీట్ చేశారు. భవిష్యత్ లో నిర్వహించే షోలలో శ్రావణికి తప్పకుండా అవకాశం ఇస్తామని తెలిపాడు దేవి శ్రీ.  ఇచ్చిన మాట ప్రకారం ఆమెను ఓ షోకు తీసుకెళ్లారు.

ఇందుకు సంబందించిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేసి కేటీఆర్ కు ట్యాగ్ చేశారు దేవి శ్రీ ప్రసాద్. కేసీఆర్ సర్ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని రాసుకోవచ్చారు. తమిళంలో నిర్వహిస్తున్న స్టార్ టు రాక్ స్టార్ కార్యక్రమంలో శ్రావణికి అవకాశం ఇచ్చినట్లు తెలిపాడు దేవి శ్రీ. ఈ ఎపిసోడ్ జీ తమిళ్ చానల్లో జులై 18 ఆదివారం రాత్రి 7.30 గంటలకు ప్రసారం అవుతుంది” అని వివరించారు. దేవి ట్వీట్ కు స్పందించిన కేటీఆర్ మీ స్పంద‌న అమోఘం అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మెదక్ జిల్లా నారైంగి గ్రామానికి చెందిన శ్రావణి రేలా రే రేలా రే అనే తెలంగాణ పాటను పాడుతూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఓ వ్యక్తి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడంతో ఆ వీడియో గమనించిన కేటీఆర్, దేవి శ్రీ ప్రసాద్.. థమన్ లకు ట్యాగ్ చేశారు. కేటీఆర్ చొరవతో శ్రావణికి మంచి అవకాశం దక్కింది.