ప్రమాదం జరగడం దురదృష్టకరం మంత్రి జగదీశ్వర్…మంటల్లో చిక్కుకున్న సిబ్బంది వీరే

  • Published By: madhu ,Published On : August 21, 2020 / 06:54 AM IST
ప్రమాదం జరగడం దురదృష్టకరం మంత్రి జగదీశ్వర్…మంటల్లో చిక్కుకున్న సిబ్బంది వీరే

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో నున్న శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరమని మంత్రి జగదీశ్వర్ అన్నారు. 2020, ఆగస్టు 20వ తేదీ అర్ధరాత్రి ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఆయన..హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.



సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ…యూనిట్ 1లో మంటల చెలరేగాయని, పెద్ద ఎత్తున్న చెలరేగుతున్న మంటలను ఆర్పేందుకు అక్కడున్న పని చేస్తున్న సిబ్బంది ప్రయత్నించారన్నారు. కానీ..అది వీలు కాలేకపోయిందని, దీంతో 8 మంది సిబ్బంది బయటకు రాగా.., మరో 9 మంది సిబ్బంది బయటకు రాలేకపోయారన్నారు.

భారీగా మంటలు ఉండడం, దట్టంగా పొగ అలుముకున్నాయని, మూడుసార్లు రెస్క్యూ టీం ఆక్సిజన్ మాస్క్ లు పెట్టుకుని లోపలకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కానీ దట్టంగా పొగ ఉండడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వీరందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.



గల్లంతయిన అధికారులు : – 
ఇక ప్రమాదం జరిగిన సమయంలో ఎంత మంది సిబ్బంది ఉన్నారనే సంగతి తెలవడం లేదు. మంటల్లో డీఈ, నలుగురు ఏఈలు, ఇద్దరు అమ్రాన్ కంపెనీ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. డీఈ శ్రీనివాస్, ఏఈలు సుందర్, మోహన్ కుమార్, సుష్మా, ఫాతిమా, వెంకట్ రావు, అమ్రాన్ బ్యాటరీకి చెందిన సిబ్బంది ఎట్టి రాంబాబు, కిరణ్ లు గల్లంతయ్యారు.